Hanamkonda Collectorate : హనుమకొండ కలెక్టరేట్ లో దారుణం జరిగింది. కలెక్టరేట్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపుతోంది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ కలెక్టరేట్ లోనే మహిళా సిబ్బందిపై అత్యాచారానికి ప్రయత్నించారు. అతని బారి నుంచి తప్పించుకున్న బాధితులు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. నిందితుడిపై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.
read also : Ministers : నేడు మేడారంకు మంత్రులు సీతక్క, పొంగులేటి..
ఇర్ఫాన్ సోహెల్ గత కొన్నేళ్లుగా కలెక్టరేట్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విధులకు రావాలంటేనే కింది స్థాయి మహిళా ఉద్యోగులు భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అయితే కలెక్టరేట్ లోనే అతను ఈ స్థాయిలో అరాచకానికి పాల్పడటంపై అనుమానాలకు దారి తీస్తోంది. అతనికి పై స్థాయిలో అండదండలు ఉండటం వల్లే ఇన్ని రోజులు వేధింపులకు పాల్పడుతున్నా ఉద్యోగంలో కొనసాగుతున్నాడేమో అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
read also : Pawan Kalyan : ఆ హిట్ డైరెక్టర్ తో పవన్ సినిమా..? నిజమైతే భలే ఉంటుందే..