Srikanth Bharath: దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాటం చేసి, అహింసా సిద్ధాంతంతో భారతదేశానికి బాసటగా నిలిచిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ (మహాత్మా గాంధీ)పై అసభ్యకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యర్‌పై తీవ్ర స్థాయిలో పలువురు మండిపడుతున్నారు. గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు నటుడు శ్రీకాంత్ పాల్పడ్డారని ఆరోపించారు. మహాత్ముని గౌరవాన్ని కించపరచిన అతడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Telangana : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల.. రాజకీయ వర్గాల్లో హల్చల్!
అయితే, మహాత్మా గాంధీపై అసభ్యకర వ్యాఖ్యలు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ పై యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యులు, సేవాలాల్ బంజారా సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని వ్యక్తిగతంగా దూషించారని, నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. దేశం గర్వించే గాంధీపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి సమాజంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రమాదముంది.. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.