Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రవి అనే యువకుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కత్తితో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా.. వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో రవి కత్తితో దాడి చేయడమే కాకుండా, పోలీసు జీప్‌పై కర్రలతో దాడి చేశాడు. దీంతో కొంతసేపు పామిడి పట్టణంలో గందరగోళ వాతావరణం నెలకొంది.…
Secunderabad: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. అయితే ఓ బిల్డింగ్ లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడుకు చేరుకున్నారు.
బెంగళూరులోని రాజనుకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావల్లిపురలో ఎనిమిది మంది నైజీరియన్స్ ను పోలీసు అధికారులపై దాడి చేసినందుకు అరెస్టు చేసారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) మావల్లిపుర ప్రాంతంలో డ్రగ్స్ పెడ్లర్ గురించి సమాచారం అందుకుంది. దీంతో వారు సోదాలు నిర్వహించారు. also read: IPL tickets Hyderabad: ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా బుక్కైన ఐటీ ఉద్యోగులు.. అయితే అక్కడికి చేరుకోగానే నైజీరియా జాతీయులు పోలీసులపై దాడి చేశారు.…
తాజాగా ఓ మసాజ్ సెంటర్‌లో అభ్యంతరకరమైన స్థితిలో యువతులతో కలిసి ఉన్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ పోలీసుల ఆకస్మిక దాడుల్లో పట్టుబడడం విశాఖపట్నం నగరంలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున్న స్పాల సెంటర్ లలో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు, అలాగే కొన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో నగర సీపీ రవిశంకర్ అయ్యన్నార్ బుధవారం రాత్రి సమయంలో ఆకస్మిక సోదాలు నిర్వహించాలని తన పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. దీనితో విశాఖపట్నం నగరంలోని 64 మసాజ్/స్పా…
పోలీసులపై పేకాటరాయుళ్లు దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. భీమడోలు మండలం గుండుగొలనులో నిన్న అర్థరాత్రి పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే పోలీసులు దాడులు నిర్వహించడంతో పేకాటరాయుళ్లు తిరుగబడి పోలీసులపైనే దాడులు చేశారు. ఈ దాడిలో పోలీసులు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసుల నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడిచేసిన నిందితులు ఏలూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు…