Secunderabad: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. అయితే ఓ బిల్డింగ్ లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడుకు చేరుకున్నారు. కాగా పోలీసులు వచ్చారన్న సమాచారంతో పేకాట ఆడుతున్న వారందరూ అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అందులో ఓ వ్యక్తి ఎక్కడి నుంచి వెళ్లాలో తెలియక మూడో అంతస్తు భవనం పై నుంచి కిందికి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: కాజల్ బెడ్ రూం ఫోటోస్ వైరల్..
లాలాపేటలోని శాంతినగర్ కు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ప్రైవేటు ఉద్యోగి. గురువారం రాత్రి లక్ష్మీనగర్ ప్రాంతంలోని ఓ భవనంపై కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా పేకాట అడుతున్నారు. అయితే, వినయ్ కుమార్ అనే వ్యక్తి కూడా రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసులను గమనించిన కొందరు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. వినయ్ కుమార్ కూడా తప్పించుకునే ప్రయత్నంలో మూడవ అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్ర గాయాలైన వినయ్ ను స్థానికులు అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించగా…చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న లాలాగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినయ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు కుటుంబంతోనే వున్నాడని, ఎవరో కాల్ చేస్తే వెళ్లొస్తా అంటూ ఇంటి నుంచి వినయ్ బయలు దేరాడని తెలిపారు. కానీ ఇంతలోనే వినయ్ కానరాని లోకాలకు వెళ్లిపోయాడని వాపోయారు. ఇంటి పెద్దదిక్కుగా వున్న వినయ్ మృతి చెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Hyderabad: నగరంలో కలకలం.. ఒకే రోజు నలుగురు అదృశ్యం..