తెలంగాణలో గత కొంతకాలంగా మావోయిస్టుల అలజడి తగ్గింది. వరుస కూంబింగ్ లు…ఏరియా డామినేషన్ టీంలు..అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టిన పోలీసులు…ఇప్పుడు సైలెంట్ అయ్యారా…ఆమధ్య తెగ హడావిడి చేసిన పోలీసులు ఉన్నట్టుండి ఆముచ్చటే ఎత్తకపోవడానికి కారణం ఏంటి? రాష్ట్ర సరిహద్దు దాటి వచ్చిన మావోయిస్టులు మళ్ళీ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారా?.ఉమ్మడి జిల్లాలో మావోయిస్టులు ఉన్నారా…వెళ్ళారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గతకొంతకాలంగా మావోయిస్టుల సంచారం ఉందని పోలీసులు ప్రకటించారు..నాలుగు జిల్లాల పోలీసులు మావోయిస్టుల పోస్టర్లు విడుదల చేయడంతో పాటు ఇదిగో అదిగో అంటూ వరుస ప్రెస్ మీట్లు పెట్టేశారు.
అంతే కాదు ఉమ్మడి జిల్లా అడవుల్లో సంచరిస్తున్న మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు సూచించారు..మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు తిర్యాణి ,మంగీ,జన్నారం,అలాగే బోథ్ ,నిర్మల్ జిల్లా అటవీప్రాంతంతోపాటు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు..ఆదివాసీ గూడెల్లో పోలీసులు,గ్రేహాండ్స్ బలగాల బూట్ల చప్పుళ్లతో కొద్ది రోజులుగా ఏంజరగుతుందో అనే ఉత్కంఠ కొనసాగింది.
Read Also: Tejashwi Yadav: తేజస్వీ యాదవ్‌కు జైలు తప్పదా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
ఆయా జిల్లాల ఎస్పీలు సైతం ఏజెన్సీ,ఆదివాసీ గూడెల్లో పర్యటించారు..అంతా ఫీల్డ్ లో ఉండి తనిఖీలు చేశారు..మంచిర్యాల ,కొమురం భీం జిల్లాల పోలీసులు గోదావరి ,ప్రాణహిత సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.. అలాగే పక్కరాష్ట్రం నుంచి వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు సైతం చేశారు..నదుల ఫెర్రీ పాయింట్స్ పై నిఘా ఉంచారు…అయితే ఇప్పుడు మాత్రం అంతా కూల్ పోజిషన్ కనిపిస్తోంది..మొన్నటి వరకు చేసిన హాడావుడి లేదు…కూంబింగ్ లేదు..ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దగా పోలీసుల సంచారం కనిపించడం లేదు..అయితే వచ్చిన మావోయిస్టులు మళ్లీ సేఫ్ గా స్టేట్ బార్డర్ దాటి వెళ్ళిపోయి వుంటార టాక్ సైతం పోలీసుల వర్గాలనుంచి వినిపిస్తోంది.
ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర సరిహద్దుల గుండా మావోయిస్టులు వచ్చారని అడెల్లు అలియాస్ భాస్కర్ టీం,అలాగే యాక్షన్ టీంల సంచారం ఉందని ప్రకటించారు. ఆమధ్యకాలంలో మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు విడుదల అయ్యాయి..అయితే వచ్చిన మావోయిస్టులు తిరిగి వెళ్ళారా…వచ్చి సేఫ్ జోన్ లో సైలెంట్ గా ఉన్నారనేది మాత్రం క్లారిటీ లేదు..కాని మొన్నటి వరకు పోలీసుల్లో కనిపించిన హైరానా మాత్రం ఇప్పుడు లేదు..కొంతమంది అధికారులు అయితే తమ అప్రమత్తతతో మావోయిస్టులు తోకముడిచి వెళ్ళిపోయారని చెబుతున్నారు…మావోల ఎపిసోడ్ లో ఏం జరగిందనే చర్చ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో సాగుతోంది..అయితే కేవలం మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి,నిల్వాయి పరిదిలో మాత్రం అడపదడపా పోలీసుల తనిఖీలు సాగుతున్నాయి..అయితే మావోయిస్టులు ఉన్నారా వెళ్ళారా అనేది మాత్రం పోలీసుల నుంచి పూర్తి స్థాయి క్లారిటీ రావడంలేదు.
Read Also: Actress Ashita: అందుకు ఒప్పుకోలేదని.. ఇండస్ట్రీ నుంచి తరిమేశారు