Youtuber : ఇలా కూడా చేస్తారా..? నిర్జల ఏకాదశి స్పెషల్ బీర్లు పంచిన యూట్యూబర్..!
- పవిత్ర రోజున మద్యం పంపిణీపై తీవ్ర వ్యతిరేకత
- యూట్యూబ్ ఫేమ్ కోసం మత పరమైన విలువలకు తూట్లు
- లప్పు సచిన్‌తో పాటు ఏడుగురు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtuber : రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో యూట్యూబ్ పాపులారిటీ కోసం ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. పవిత్రమైన నిర్జల ఏకాదశి రోజున యూట్యూబ్ ఫేమ్ కోసం బీర్ బాటిళ్లు ఉచితంగా పంచుతూ వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మతభావనలు దెబ్బతీసేలా ఉన్న ఈ చర్యపై చర్య తీసుకున్న పోలీసులు అతనితో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.
జైపూర్‌కు చెందిన లప్పు సచిన్ అలియాస్ సచిన్ సింగ్ అనే యూట్యూబర్ నిర్జల ఏకాదశి రోజున బీర్ పంపిణీ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సాధారణంగా హిందూధర్మంలో ఈ రోజున పూర్తిగా ఉపవాసం పాటిస్తూ, నీటితో మాత్రమే ఉండే సంప్రదాయం ఉంది. అయితే ఈ పవిత్ర రోజుననే బీర్ పంపిణీ చేసి వీడియోలు షేర్ చేయడం తీవ్ర అభ్యంతరం కలిగించేలా మారింది.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
Lok Sabha Elections: నారీమణులకు కేంద్రం గుడ్‌న్యూస్..! వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో..!
ఇన్‌స్టాగ్రామ్‌లో లప్పు సచిన్‌కు 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, యూట్యూబ్‌లో 6.99 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఫాలోయింగ్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే అతడు మరో ఆరుగురితో కలిసి ఆటో రిక్షా డ్రైవర్లు, రోడ్డు ప్రయాణికులకు బీర్ బాటిళ్లు పంచినట్లు పోలీసులు తెలిపారు.
వీడియో వైరల్ కావడంతో జనాల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. అనేక మంది దీనిపై మండిపడుతూ మత భావనలు కించపరిచినందుకే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన జైపూర్ సౌత్ పోలీస్ కమిషనర్ దిగంత్ ఆనంద్ నేతృత్వంలోని పోలీసులు లప్పు సచిన్‌తో పాటు మిగిలిన ఆరుగురిని అరెస్ట్ చేశారు.
ఏకాదశి రోజున సాధారణంగా ప్రజలు ఇతరులకు నీరు, మజ్జిగ, ఫలహారాలు అందిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ అందులోనూ అలాంటి పవిత్ర రోజున బీర్ పంపిణీ చేయడమంటే మరీ హద్దు దాటిన పనిగా పోలీసులు పేర్కొన్నారు. యూట్యూబ్ ఫేమ్ కోసం మతపరమైన విలువలను తక్కువచేసేలా ప్రవర్తించడాన్ని సమాజం ఖండించాలి అని వారు పేర్కొన్నారు.
Schools Reopen : వేసవి సెలవులకు గుడ్‌బై.. పండుగ వాతావరణంలో స్కూల్స్ రీఓపెన్
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!