Rahul Gandhi Fires For Hiking GST Rates: ఆధార ధరలపై కేంద్రం జీఎస్టీ విధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. పన్నులు పెంచుతున్నారు కానీ, ఉద్యోగాలు ప్రకటించడం లేదంటూ అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘‘పన్నులేమో అధికం, ఉద్యోగాలేమో శూన్యం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని నాశనం చేయడంలో బీజేపీది మాస్టర్ క్లాస్ పనితీరు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీని గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌గా…
సోమవారం ఉదయం ఢిల్లీలోని పార్లమెంట్‌లో మొదలైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును...
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారు.
దేశంలో భారత 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది.
సింగపూర్ ఓపెన్-2022 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని మోదీ అభినందించారు.భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను మహిళల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన వాంగ్ జియీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి సమావేశం ఈ రోజు జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్లు వర్చువల్ గా సమావేశం కానున్నారు. ఈ నాలుగు దేశాల్లో మౌళిక సదుపాయాలను ఆదునీకరించడంతో పాటు ఆరు రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా ప్రధాన చర్చ జరగనుంది. ఐ2యూ2 కూటమిని పశ్చిమాసియా దేశాల క్వాడ్…
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేని హత్య చేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. జపాన్ నారా పట్టణంలో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు రెండు రౌండ్ల పాటు షింజో అబేపైకి కాల్పులు జరిపారు. దీంతో షింజో అబే మరణించారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షింజో అబేకు నివాళిగా భారత్ రేపు(జూలై 9) ఒక రోజు పాటు జాతీయ సంతాప దినం పాటించాలని ప్రధాని మోదీ…
తెలంగాణలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు తమ ప్రచారాల్ని మొదలుపెట్టేశాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేసుకుంటున్నారు. వినూత్నమైన ప్రచారాలకూ శ్రీకారం చుడుతున్నారు. బీజేపీ పార్టీ అయితే మరీ దూసుకుపోతోంది. టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్నే లక్ష్యం చేసుకొని.. విమర్శనాస్త్రాల్ని సంధిస్తోంది. ఇప్పుడు సాలుదొర – సెలవు దొర ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. కేసీఆర్‌కి వ్యతిరేకంగా పాటలు కూడా…
రామాయణంలో రాముడికి హన్మంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. తనకు సోనియా గాంధీ గొప్ప అవకాశం ఇచ్చారని.. ప్రధాని, సీఎం పదవుల కంటే పీసీసీ పదవి చాలా గొప్పదని చెప్పారు. జీవితాంతం తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విశ్వాసపాత్రుడిగా పని చేస్తానని తెలిపారు. గురువారం పార్టీలో చేరినవారిని ఘనస్వాగతం పలికిన రేవంత్.. ఈ సందర్భంగా…