తమ ప్రసంగంలో ప్రతీసారి ముస్లిములు, మొగలుల ప్రస్తావన తీసుకురావడంపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లిములనే బీజేపీ నిందిస్తోందని ఆరోపించిన ఆయన.. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టి ఉండకపోతే.. ఈరోజు దేశంలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 40 మాత్రమే ఉండేదని వ్యంగాస్త్రాలు చేశారు. అంతేకాదు.. యువత నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడంటూ సెటైర్ల మీద సెటైర్ల వేశారు. ‘‘ఈరోజు…
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.. ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నంతసేపు మూడంచెల భద్రత కొనసాగించనున్నారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ జరిగింది.. పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసమే జరిగింది.. ఆ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. అయితే, కేంద్రం మాత్రం వెనక్కి తగ్గకుండా మరో ముందుడుగు వేసి నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది.. ఇక, అగ్నిపథ్‌పై ఆందోళన వ్యక్తం అవుతోన్న సమయంలో.. అగ్నిపథ్, ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతోన్న ఆందోళనపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటక పర్యటనలో…
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అల్లర్లకు తెరలేపాయి. అంతేకాదు.. ఇస్లామిక్ దేశాలు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం దోహాలోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది కూడా! నుపుర్‌తో పాటు ట్విటర్ మాధ్యమంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ జిందాల్‌పై పార్టీ వేటు వేసినప్పటికీ.. ఆ లోపే…
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ నేతల మధ్య మధ్య మాటల యుద్ధంగా తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఆమధ్య బీజేపీ నిర్వహించిన ఓ బహిరంగ సభ నుంచి మొదలైన ఈ మాటల పోరు.. అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే తమ పార్టీనే గెలుస్తుందంటూ సమరశంఖం పూరిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తమ బీజేపీనే వచ్చే ఎన్నికల్లో…
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాన రాష్ట్రం దివాళా దిశగా సాగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి 80 శాతం ఆదాయం వస్తోన్నా.. అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లన్నీ గతుకులమయంగా ఉన్నాయని.. జీహెచ్ఎంసీ, జలమండలి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో తెలంగాణ సర్కార్ ఉందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలో విసిగిపోయారన్న ఆయన.. ఎనిమిదేళ్ళ మోదీ పాలనపై…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని బాధించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్, పాలమూరు ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ప్రకటిస్తారేమోనని ఎదురుచూస్తే.. అవేమీ ఇవ్వకపోగా తన హోదాకు తగినట్లు మాట్లాడలేదని అన్నారు. ఒక విద్యాలయం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సమంజం కాదన్నారు. రాజకీయాలకు బదులు తెలంగాణ విద్యార్థుల కోసం నూతన విద్యాలయాలపై ఏదైనా ఒక ప్రకటన చేసి ఉంటే, తెలంగాణ సమాజం హర్షించేదన్నారు. ‘బేటి…
ఐఎస్పీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రయాణంలో ఐఎస్బీ కీలక మైలురాయికి చేరుకుందని, . 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయ్ దీనిని ప్రారంభించారని, ఎంతోమంది కృషి వల్లే ఆసియాలోనే టాప్ బిజినెస్ స్కూల్‌గా అవతరించిందన్నారు. ఐఎస్బీ విద్యార్థులు ఎన్నో స్టార్టప్‌లు ప్రారంభించారని పేర్కొన్నారు. G20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతే అన్న ప్రధాని.. ప్రపంచంలో బలమైన స్టార్టప్ ఇకో సిస్టమ్ ఉన్న దేశాల్లో…
సైలెంట్ గా వచ్చి కోట్లు కొల్లగొట్టిన చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్”. అదే లెవెల్లో విమర్శలూ ఎదుర్కొంది ఈ మూవీ. అంతేనా సినిమా గురించి ఢిల్లీ రాజకీయాల్లోనూ గట్టి చర్చే జరిగింది. ఏకంగా ప్రధాన మంత్రి సినిమాను ప్రమోట్ చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అనే విమర్శలూ తప్పలేదు. ఏదైతేనేం సినిమా ప్రేక్షకులకు నచ్చింది. కలెక్షన్లూ భారీగానే రాబట్టింది. అటు దర్శకుడికి మంచి పేరు, ఇటు నిర్మాతలకు అద్భుతమైన లాభాలూ వచ్చాయి. తాజాగా “ది కాశ్మీర్…
ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ రాజధాని పొలిటికల్ లీడర్లతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా యువ ఎంపీల కూతుళ్లను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. తాజాగా టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కుమార్తెకు ప్రధాని మోదీ చాక్లెట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. కాగా అంతకుముందు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కుమార్తెకు…