రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
భారత 14వ రాష్ట్రపతిగా సేవలు అందించిన రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం ఘనంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ఇతర కేంద్రమంత్రులు, రాజ్యసభ,లోక్ సభ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ నుంచి దిగిపోతున్న క్రమంలో ఆయన దేశాన్ని ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు.
Congress blames Union Minister Smriti Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. స్మృతి ఇరానీ కూతురు.. గోవాలో అక్రమంగా బార్ నడుపతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఇరానీ కుటుంబం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని…
Asaduddin Owaisi's comments on PM Narendra Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర నేపథ్యంలో యాత్ర మార్గంలో మాంసం దుకాణాలు మూసివేయడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కన్వర్ యాత్రంలో భాగంగా యాత్ర మార్గంలోని మాంసం దుకాణాలను జూలై 18 నుంచి జూలై 27 వరకు మూసివేయాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై అసదుద్దీన్ విరుచుకుపడ్డారు.
PM Narendra Modi, Pak PM Shehbaz Sharif MEETING may take place: పుల్వామా, యూరీ ఘటనల తరువాత ఇండియా-పాకిస్తాన్ సంబంధాలు క్షీణించాయి. ఈ ఘటనల తరువాత సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ తో ఇండియా, పాకిస్తాన్ కు సమాధానం ఇచ్చింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం చాలా వరకు తగ్గింది. ఇక దౌత్యపరమైన సమావేశాలు కూడా జరగలేదు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేని విధంగా తగ్గిపోయాయి.
Central Govt key announcement in Parliament on Jamili election: కేంద్రం జమిలి ఎన్నిలకు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్రం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది. అలాగే అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించామని కేంద్రం వెల్లడించింది.
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపొందారు. భారతదేశంలో తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా, రెండో మహిళా రాష్ట్రపతిగా ముర్ము గెలుపొంది చరిత్ర సృష్టించారు. గురువారం జరిగిన రాష్ట్రపతి ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి మద్దతుతో పోటీ చేసి ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు. ఇదిలా భారత 15వ రాష్ట్రపతిగా గెలుపొందిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. కాబోయే రాష్ట్రపతికి, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ శుభాకాంక్షలు…