ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చే నెలలో ఆయన విశాఖలో పర్యటించనున్నారు.. నవంబర్ 11వ తేదీన విశాఖ రానున్న ఆయన.. రూ.400 కోట్లతో విశాఖలో చేపట్టనున్న రైల్వే నవీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.. రైల్వే నవీకరణ పనులతో పాటు.. పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు భారత ప్రధాని… ఈ అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి…
Prime Minister Modi congratulates Rishi Sunak: యూకే ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు రిషి సునక్. యూకే ప్రధానిగా తొలిసారిగా ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మరోసారి ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. అయితే ప్రధాని రేసులో రిషి సునాక్ తో పాటు పెన్నీ మోర్డాంట్, బోరిస్ జాన్సన్ ఉన్నా.. చివరకు వారిద్దరు విరమించుకోవడంతో ఏకగ్రీవంగా రిషి సునాక్ విజయం సాధించారు. ప్రస్తుతం బ్రిటన్ ఉన్న…
Reunited after 21 YEARS, Gujarat school student meets PM Modi: సరిగ్గా 21 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు మళ్లీ ముఖాముఖిగా కలుసుకున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..? 21 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉన్నప్పుడు మోదీ నుంచి పతకాన్ని అందుకున్న విద్యార్థి, ఆర్మీ మేజర్ గా మళ్లీ ప్రధానిని కలిశారు. దీపావళి వేళ ఈ అద్భుత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ లో భారత జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు.…
చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని మోడీకి పోస్ట్ కార్డు రాశారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీరాముడు నడయాడిన అయోధ్య నగరం దీపాల కాంతుల్లో వెలుగులు చిందించింది. ఈ సారి దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా సరయు నది ఒడ్డున 15 లక్షలకు పైగా దీపాలు వెలిగించి అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా "సబ్కా సాత్ సబ్కా వికాస్" ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు చేస్తోన్న వాగ్దానాలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలో కూడా ముస్లింలకు గౌరవం లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ముస్లింలను పార్టీలు ఏటీఎంలుగా వాడుకుంటున్నాయని అసదుద్దీన్ ఆరోపించారు. కర్ణాటక హుమ్నాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. గత ఎనిమిదేళ్లుగా సెక్యులర్ పార్టీలు కూడా ముస్లింల సమస్యలపై స్పందించడం లేదని.. అంతగా దేశ రాజకీయాలను మార్చినందుకు ప్రధాని…