PM Narendra Modi Launches TATA-Airbus Plane Project In Gujarat: గుజరాత్ వడోదరలో టాటా-ఎయిర్ బస్ విమాన ప్రాజెక్టుకు ఆదివారం శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ. 22,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టును భారతదేశాని పెద్ద అడుగుగా ప్రధాని అభివర్ణించారు. భారత వైమానిక దళం కోసం సీ-295 రవాణా విమానాలను టాటా-ఎయిర్ బస్ తయారు చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమానయాన రంగంలో భారత్ స్వావలంబన దిశగా…
సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం సాధించిన ప్రగతి గురించి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన మన్ కీ బాత్‌లో భారతదేశం సౌర, అంతరిక్ష రంగంలో అద్భుతాలు చేస్తోందని అన్నారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బీజేపీ అవకాశం కల్పిస్తే లోక్‌సభ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.
Centre Is Working On Providing 10 Lakh Jobs, Says PM Modi: కేంద్ర ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శనివారం గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’లో వీడియో సందేశం ఇచ్చని ఆయన, యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ కార్యక్రమంలో 5,000 మంది వ్యక్తులకు గుజరాత్ పంచాయతీ సర్వీస్ బోర్డ్ నుంచి…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పొగడ్తలతో ముంచెత్తారు. పుతిన్ గురువారం మాస్కోకు చెందిన థింక్ ట్యాంక్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్‌లో తన వార్షిక ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు.
Indian Musical Instruments Exports: ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ప్రథమార్ధంలో మన దేశం నుంచి సంగీత వాయిద్యాల ఎగుమతులు 3.5 రెట్లకు పైగా పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ఎక్స్పోర్ట్ల విలువ 172 కోట్ల రూపాయలుగా నమోదైంది. దాదాపు పదేళ్ల కిందట.. అంటే.. 2013-14 ఫైనాన్షియల్ ఇయర్లోని ఇదే సమయంలో ఈ ఎగుమతుల విలువ కేవలం 49 కోట్ల రూపాయలేనని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్లో తెలిపారు.
యూకే నూతన ప్రధానిగా నియమితులైన రిషి సునాక్కు ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం శుభాకాంక్షలు చెప్పకుండా దూరంగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్దేవి ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ భగవంతుడి అవతారమని, ఆయన కోరుకున్నంత కాలం ఆయన పదవిలో కొనసాగవచ్చని ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి బుధవారం అన్నారు.