అయోధ్యలో రామ మందిరం త్వరలో సిద్ధమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. ఆలయ నిర్మాణంలో హిందూ ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్యుల సహకారాన్ని కొనియాడారు.
Jio Space Fiber: రిలయన్స్ జియో దేశంలోని మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేయడానికి జియో స్పేస్ ఫైబర్ కొత్త సాంకేతికతను తీసుకువస్తోంది. ఈ టెక్నాలజీ సహాయంతో గ్రామాలు, కష్టతరమైన ప్రాంతాలలో కూడా నెట్‌వర్క్ సమస్య ఉండదు.
మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన సన్నాహాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మిషన్ సన్నద్ధతను అంచనా వేయడానికి ఈ సమావేశం నిర్వహించబడింది.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు.
ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనలను నెరవేర్చడంలో ప్రధాని బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటనలను సమీక్షించేందుకు ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు.
The Vaccine War: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ మేకర్స్ నుంచి వచ్చి మరో సినిమా ‘ది వాక్సిన్ వార్’. కోవిడ్ సమయంలో భారత శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందించిన కథాంశంతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తీశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో శాస్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు, వారి కృషిని ఆధారంగా ఈ సినిమాను తీశారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు.
నేడు తెలంగాణ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్ లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభా వేదికగా వాగ్బాణాలను సంధించారు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతమంటూ విమర్శలు గుప్పించారు.