Congress: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన ప్రధానిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ విధంగా దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి.
2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో కూర్చొని వీక్షించారు. ప్రధాని వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ కూడా ఉన్నారు.
World Cup 2023: క్రికెట్ ఫ్యాన్ రేపు జరగబోతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచు కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది.
PM Modi to hand over World Cup 2023 Trophy to winning captain: అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ 2023 తుది పోరు జరగనుంది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకోగా.. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై అతి కష్టంమీద గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధించింది.…
నవంబర్ 17న చత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు(సోమవారం) విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌కు చేరుకున్నారు. భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు.
Uttarkashi Tunnel : ఉత్తరకాశీలో దీపావళి రోజున యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి NDRF బృందం రెండవ రోజు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. వారికి ఆహార పానీయాలు పంపిణీ చేశారు.
మాదిగల విశ్వరూప మహా సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు.
ఎన్డీయే ప్రభుత్వ తొలి లక్ష్యమే పేదరిక నిర్మూలన అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. గుర్రం జాషువా తన కష్టాల్ని కాశీ విశ్వేశరుడికి విన్నవించుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుడి దీవెనలతోనే నేను ప్రధానిగా మీ ముందు ఉన్నానన్న ప్రధాని మోడీ.. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే.. ఆనందం రెట్టింపు అవుతుందన్నారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభ జరుగుతోంది. విశ్వరూప మహాసభకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ప్రధాని రాక నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణుల నినాదాలు మారుమ్రోగాయి. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకున్న ప్రధాని మోడీకి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.