Rojgar Mela 2023: రోజ్‌గార్ మేళా 2023లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు 51 వేల మంది యువతకు నియామక పత్రాలను అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి మేళాను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేయడమే కాకుండా పని చేస్తుందని అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఉపాధి మేళా ప్రారంభించామని, ఇప్పటి వరకు లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామని ప్రధాని మోడీ అన్నారు. నేడు 50,000 మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. దీపావళికి ఇంకా సమయం ఉంది, కానీ 50,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లు పొందిన వారి కుటుంబాలకు ఈ అవకాశం దీపావళి కంటే తక్కువ కాదన్నారు.
Also Read: Asaduddin Owaisi: ‘‘మీకు అంత సానుభూతి ఉంటే’’.. అమిత్‌షాపై ఓవైసీ ఫైర్
ఈ విభాగాల్లో ఉద్యోగాలు వచ్చాయి..
ప్రధానమంత్రి యువతకు అందజేసిన నియామక పత్రాలు వివిధ శాఖలకు చెందినవి. దేశవ్యాప్తంగా ఎంపికైన ఈ ఉద్యోగులు హోం మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, పోస్టల్ శాఖ, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖతో సహా ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో చేరతారు.
Also Read: Iran: హిజాబ్ ధరించలేదని అమ్మాయిపై దాడి.. నెల రోజుల కోమా తర్వాత మృతి
ప్రధాని ఇంకా ఏం చెప్పారంటే..
ప్రధాని మాట్లాడుతూ.. “యువత పట్ల మనకున్న నిబద్ధతకు ఉపాధి మేళాలు నిదర్శనం. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా మొత్తం వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతున్నాం. మేము రిక్రూట్‌మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే కాకుండా కొన్ని పరీక్షలను పునర్నిర్మించాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్‌మెంట్ సైకిల్‌లో తీసుకున్న సమయం ఇప్పుడు సగానికి తగ్గించబడింది.” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.