PM Modi: మోడీ కాన్వాయ్ రిహార్సల్ చేస్తుండగా బాలుడు సైక్లింగ్.. చితకబాదిన పోలీస్
- మోడీ కాన్వాయ్ రిహార్సల్ చేస్తుండగా బాలుడు సైక్లింగ్
- భౌతికదాడి చేసి స్టేషన్‌కు తరలించిన పోలీస్ అధికారి
- వీడియో వైరల్.. స్థానికుల ఆగ్రహంతో అధికారిపై చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శుక్రవారం గుజరాత్‌లో పర్యటించారు. అయితే ముందుగా గురువారం సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్ చేసింది. ఆ సమయంలో హఠాత్తుగా ఓ బాలుడు(17) సైకిల్ తొక్కుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. దీన్ని గమనించిన పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ వెంటనే సైక్లింగ్ చేస్తున్న బాలుడిని అడ్డుకుని చితకబాదాడు. తల మీద, ముఖంపై పిడుగుద్దుల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: CM Chandrababu: నేడు మార్కాపురానికి సీఎం చంద్రబాబు.. మహిళలతో ముఖాముఖి
Also Read
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
గురువారం సూరత్‌లోని రతన్ చౌక్ దగ్గర మోడీ కాన్వాయ్ రిహార్సల్ జరుగుతున్నాయి. 17 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుతున్నాడు. అక్కడే ఉన్న పోలీస్ అధికారి బీఎస్ గధ్వి.. బాలుడిని నిలువరించి చెంపదెబ్బకొట్టాడు. పిడుగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌కు తరలించి.. రాత్రి వరకు స్టేషన్‌లో కూర్చోబెట్టారు. బిడ్డ ఏమయ్యాడో తెలియక.. తల్లిదండ్రులు అల్లాడిపోయారు. రాత్రి 9:30 గంటలకు బాలుడు ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం చెప్పడంతో పోలీసుల తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. ఏదైనా తప్పు చేస్తే కౌన్సెలింగ్ ఇచ్చో.. లేదంటే మందలించి పంపించాలి కానీ.. రాత్రి వరకు స్టేషన్‌లో కూర్చోబెట్టడమేంటి? అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Hyderabad: అంబర్‌పేట్‌లో 19 నెలల చిన్నారిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు
అయితే ఈ ఘటనపై స్థానిక నివాసులు మండిపడ్డారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత వనాని స్పందిస్తూ.. జరిగిన తీరును ఖండించారు. పోలీస్ అధికారి గధ్వి ప్రవర్తన అనుచితంగా ఉందని… దీనికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. మోర్బి జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న గధ్విని తక్షణమే కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేసినట్లు డీసీపీ తెలిపారు. అంతేకాకుండా పెరిగిన జీతాన్ని ఒక ఏడాది పాటు నిలిపివేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా..?
https://twitter.com/adi_chauhan1/status/1897905437132923267
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!