పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం శుక్రవారం రోమ్‌కు వెళ్తుండగా ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ విలేకర్లతో మాట్లాడారు. పాకిస్థాన్-భారత్‌కు సంబంధించిన నేతలు చాలా దగ్గరగా తెలుసన్నారు. ఇక కాశ్మీర్ సమస్య 1,000 సంవత్సరాలకు పైగా ఉందని.. దానికోసం పోరాటం జరుగుతోందన్నారు. అయితే పహల్గామ్‌లో జరిగిన దాడి మాత్రం చాలా చెడ్డదన్నారు. ముష్కరుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని.. అయితే ఏళ్ల తరబడి నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: UK: పాక్ అధికారి కవ్వింపు.. పీక కోస్తామంటూ ప్రవాస భారతీయులకు బెదిరింపు.. వీడియో వైరల్
మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఇక ఈ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దును మూసేసింది. ఇలా ఒక్కొక్క దెబ్బకొడుతూ వెళ్తోంది. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్ష విధిస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ తీవ్రంగా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Pak-India: ఎల్‌ఓసీ దగ్గర పాక్ మళ్లీ కవ్వింపు చర్యలు.. కాల్పుల్ని తిప్పికొట్టిన ఆర్మీ