ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. “వికసిత్ రాజ్య, వికసిత్ భారత్-2047” ఇతివృత్తం (థీమ్)గా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కానుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి రెండు తెలుగు రాష్ట్రాల ముుఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Germany: రైల్వే స్టేషన్‌లో కత్తితో మహిళ వీరంగం.. 12 మందికి తీవ్రగాయాలు
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులంతా పాల్గొంటారు. నీతి ఆయోగ్ ఛైర్ పర్సన్‌గా ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, పూర్తికాలపు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటారు. 2047 కల్లా పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విస్తృత సమాలోచనలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Tamannaah : అమ్మ నాన్న మాట వినకపోవడం మంచిదైంది..
భారత దేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి (2047 సంవత్సరం) భారత్‌ను అభివృద్ధి చెందిన దేశం (వికసిత్ భారత్) గా ఆవిష్కృతం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. జాతీయ స్థాయి లక్ష్యానికి, రాష్ట్రాల ఆకాంక్షలను కూడా జోడించడం, సహకార సమాఖ్య వాదం (ఫెడరిలిజం)ను మరింతగా దృడపరుచుకోవడమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. శక్తివంతమైన దేశంగా భారత్‌ను రూపొందించుకునేందుకు కార్యాచరణను ఖరారు చేయనున్నారు.