కరోనా ఫస్ట్ వేవ్.. ఇప్పుడు సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మహమ్మారి బారినపడి ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి.. తల్లిదండ్రులను కోల్పోయి.. చిన్నారులు అనాథలుగా మిగిలిపోయినవారు ఎంతోమంది.. అయితే, అనాథలుగా మారిన చిన్నారులకు భరోసా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని లేఖ రాసిన ఆమె… అనాథలైన చిన్నారులకు ఉచిత విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు.. ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని…
కరోనా పెను సవాల్గా మారింది.. దానిపై జరిపే పోరాటంలో విజయం సాధించడానికి ఉమ్మడి వ్యూహం, ప్రయత్నం అవసరం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ రాష్ట్ర, జిల్లా అధికారులతో మాట్లాడారు.. కోవిడ్ పై చేసిన యుద్ధంలో మోడీ నాయకత్వానికి ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు అధికారులు.. ఆయా జిల్లాల్లో కరోనా పరిస్థితి మెరుగుపడటం గురించి ప్రధానికి వివరించారు.. రియల్ టైమ్ పర్యవేక్షణ, సామర్థ్యం పెంపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న…
రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏపీ ఎరువులపై సబ్సిడీ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎరువుల ధరలపై ప్రధాని నరేంద్రమోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా.. డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. గతంలో డీఏపీ సంచికి రూ. 500గా ఉన్న సబ్సిడీని రూ.1200కు పెంచింది కేంద్రం. ఈ సబ్సిడీ కోసం రూ. 14,775 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా…
ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని 10 రాష్ట్రాల్లోని జిల్లాల అధికారులతో సమావేశం కాబోతున్నారు. 10 రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల అధికారులతో సమావేశం కావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అధికారులతో చర్చించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.
డీఏపీ ధరలు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్రభుత్వం ఇవాళ రైతులకు అనుకూలంగా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరలను భారీగా పెంచేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్.. అదే సమయంలో.. పెరిగిన భారాన్ని రైతులపై మోపకుండా సబ్సిడీ రూపంలో తామే భరిస్తామని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర సర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్ ధర రూ. 1,700 ఉండగా.. రూ.…
నేడు దేశంలోని పలు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం కానున్నారు. “కోవిడ్-19” పరిస్థితి, వ్యాక్సినేషన్పై వారితో చేర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో భేటీ కానున్నాడు మోడీ. ఇందులో తొలి విడతగా కర్నాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలలోని జిల్లాల అధికారులతో సమావేశం కానున్న ప్రధాని మోడీ… వచ్చే గురువారం మిగతా రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు.
కరోనాకు చెక్ పెట్టేందుకు ఏకైక మార్గం వ్యాక్సినేషనే అంటున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఈ నెల 1వ తేదీ నుంచి భారత్లో వ్యాక్సినేషన్ ఊపందుకుంటుందని భావించినా.. డోసుల కొరతతో.. గతంలో కంటే వ్యాక్సినేషన్ స్పీడ్ తగ్గుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంలోని మోడీ సర్కార్ను టార్గెట్ చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం.. రోజు రోజుకూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ.. సర్కార్ వ్యాక్సిన్ వ్యూహాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్…
ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని ఈ లేఖలో కోరారు సీఎం జగన్. అంతేకాదు ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య అదనంగా 30వేలకు పెంచనున్నామని.. దీని కోసం ప్రతి రోజు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని కోరారు. స్టోరేజ్ సదుపాయం లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉపయోగించగలుగున్నామని..…