భారత్లో కరోనా వైరస్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది అని మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోనా వైరస్ విజృంభించిందని విమర్శించారు.. దేశంలో కరోనాతో ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని.. ఇప్పటికైనా మహమ్మారి కట్టడికోసం చర్య తీసుకోవాలన్నారు.. తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఒవైసీ..…
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. మరోవైపు.. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఏ రాష్ట్రంలోలేని విధంగా అక్కడ ఏకంగా ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ.. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగియగా.. మరో మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇక, ఎన్నికల ముందు నుంచీ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. ప్రధాని మోడీని టార్గెట్ చేసి విమర్శలు…
దేశంలో బీజేపీ కి ఎన్నికలు తప్ప .. కరోనా ఇబ్బందులు పట్టడం లేదు అని మాజీ ఎంపి వి.హనుమంతరావు అన్నారు. కరోనా ఇబ్బందులు ఉన్నాయని ఎన్నికల రోడ్ షో లు రద్దు చేసుకున్నాడు రాహుల్ గాంధీ. ఈ సమయంలో కుంభమేలా పెట్టాల్సిన అవసరం ఉందా.. దాంతో ఎంతమందికి కరోనా వచ్చింది. కుంభమేళా పెట్టినందుకు మోడీ,సీఎం యోగి ఆదిత్యనాథ్ పై యాక్షన్ తీసుకోవాలి అని అన్నారు. చీఫ్ జస్టిస్ దీనిపై స్పందించాలి .. మోడీ,యోగి పై చర్యలు తీసుకోవాలి…