టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది భారత్… ఒలింపిక్స్‌లో తొలి రోజే పతకాల వేల ప్రారంభించిన ఇండియా.. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ సాధించారు.. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణ మల్లీశ్వరి పతకం గెలిచిన తర్వాత మీరాబాయి చాను పతకం సాధించారు. దీంతో మీరాబాయిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు. ”ఎస్. మిరాబాయి చాను భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా టోర్నమెంట్లలో తనను తాను గుర్తించుకున్నారు. ఆమె నైపుణ్యానికి మరియు అంకితభావానికి ధన్యవాదాలు, ఈ ప్రతిభావంతులైన వెయిట్ లిఫ్టర్ క్రీడా ప్రియులందరికీ ప్రేరణ. ఖేల్ రత్న ప్రదానం చేసినందుకు ఆమెకు అభినందనలు.”అంటూ ప్రధాని మోడీ కొనియాడారు. అటు సీఎం కేసీఆర్ కూడా మీరాబాయి చానును అభినందించారు.