నేడు సాయంత్రి 4 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ అధిష్టానం చర్చించనుంది. భవిష్యత్ కార్యచరణపై కూడా సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి నియామకంపై ప్రధాన చర్చ జరుగనుంది. నేడు అమృత్సర్లో కేజ్రీవాల్, భగవంత్ మాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నెల 16న పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు శ్రీశైలంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీమల్లికార్జున…
Telangana People wanted Double Engine Government in Telangna Says Telangana BJP Chief Bandi Sanjay. ఢిల్లీ కి రాజైన తల్లికి కొడుకే.. మాములు కార్యకర్తను కేంద్రం గుర్తించేలా చేశారు.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నక్సలైట్ల చేతిలో బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రాణలు త్యాగం చేశారంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం గుర్తించి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని,…
BJP MP Bandi Sanjay Completed Two Years as Telangana BJP Chief Post. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆశీర్వచన సభ నిర్వహించారు. కాగా ఆయనను వేములవాడ రాజన్న ఆలయం నుంచి వచ్చిన పురోహితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉండి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ…
దేశవ్యాప్తంగా ఉత్కంఠ నింపాయి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ఫలితాల్లో పలు ప్రముఖ పార్టీల కంటే నోటాకే అధిక శాతం ఓట్లు పడడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం వెబ్సైట్లో చూపిన వివరాల ప్రకారం.. యూపీ ఎన్నికల్లో నోటా 0.69 శాతం ఓట్లను పొందడం గమనించాల్సిన అంశం. 100 సీట్లలో పోటీచేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం 0.47 శాతం ఓట్లు మాత్రమే పొందిందని ఈసీ తెలిపింది. ఆప్ 0.35…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.. ఇక, ఈ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశం జరిగింది.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీకి నష్టం అన్నారు.. ఈ ఫలితాలు చూసి సీఎం జగన్ మరింత భయపడతారని జోస్యం చెప్పిన ఆయన.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారన్నారు..…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విజయం అని ఆయన అభివర్ణించారు. దేశంలో తమ పాలనకు ప్రజలు ఇచ్చిన బహుమతి అని తెలిపారు. ఈసారి హోలీ మార్చి 10నే మొదలైందని.. ఇవాళ్టి ఫలితాల్లో గొప్ప సందేశం ఉందన్నారు. ప్రజల నమ్మకం, విశ్వాసం పొందేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేశారు కాబట్టి ఇది కార్యకర్తల విజయమని మోదీ తెలిపారు. దేశంలోని నాలుగు వైపులా ప్రజలు…
BJP MLA Rajasing Says 5 state Elections Result Repeat at Telangana also. ఇటీవల మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. అయితే నేడు ఈ 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థులు పంజాబ్ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. అయితే పంజాబ్లో మాత్రం ఆప్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.…
ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు 73 విమానాల్లో 15,206 మందిని భారత్ తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అలాగే 10 ఎయిర్ఫోర్స్ విమానాల్లో 2056 మందిని తరలించినట్టు తెలిపింది. సోమవారం 7 విమానాల్లో 1314 మంది భారత్ వచ్చినట్టు వివరించింది. మొత్తంగా ఫిబ్రవరి 22న ఆపరేషన్ గంగ మొదలైనప్పట్నుంచి ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 17,400 మందికి పైగా భారతీయులను సొంత దేశానికి తరలించామని వివరించింది. మంగళవారం మరో 2 విమానాలు భారత్…
ఉత్తర ప్రదేశ్ లో ఆఖరి, చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడతలో 9 జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 613 అభ్యర్థులు పోటీలో వున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆఖరి విడతలో బీజేపీ, ఎస్పీ భాగస్వామ్య పక్షాల మధ్య పోటీ వుంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాల్లో 29 స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తర్ ప్రదేశ్…
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 55 వేల కోట్లు నిధులు ఇచ్చింది ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులు డ్రా చేయాలని తపన తప్ప ప్రాజెక్టులు గురించి రాష్ట్ర ప్రభుత్వం అలోచన చేయడం లేదని ఆయన మండిపడ్డారు. రాయలసీమలో ఉండే నీటి సమస్యపై ఈ నెల 19 న రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా కడప లో బీజేపీ భారీ ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాయలసీమను రత్నాలసీమగా…