ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ… తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అంశాలపై రేవంత్ పలు ప్రశ్నలు సంధిస్తూ సమాధానలు చెప్పాలని లేఖలో కోరారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు హామీని నెరవేర్చుతారా? లేదా? అని నిలదీశారు.
విభజన హామీల్లో భాగంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అని టీపీసీసీ చీఫ్ అడిగారు. నైనీ కోల్ మైన్స్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలెందుకు తీసుకోవడం లేదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యం ఎందుకు అని నిలదీశారు. రామాయణం సర్క్యూట్ ప్రాజెక్ట్‌లో భద్రాద్రి రాముడికి చోటెందుకు ఇవ్వలేదు అంటూ లేఖలో రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణ గడ్డపై అడుగిడుతున్న సందర్భంగా ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెబుతారని ఆశిస్తున్నాం. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చిన సందర్భంలో సైతం మా ప్రశ్నలకు సమాధానం లభించలేదు. అత్యున్నత పదవిలో ఉన్న మీకు తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత ఉంది. వారి తరఫున సంధిస్తోన్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో తెలంగాణ ప్రజల మద్దతు కోరే హక్కు మీకు ఉండదని లేఖలో పేర్కొన్నారు.
TDP : డోన్ లో టీడీపీ వ్యూహం ఫలించిందా..? ఆ పార్టీలో జరుగుతన్న చర్చేంటి..?