పంజాబ్‌లో పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది… దీంతో.. రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు.. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, అమరీందర్‌సింగ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగారు.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను టార్గెట్ చేస్తే విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. పఠాన్ కోట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. పంజాబ్ ప్రజల కోసం పనిచేసే అవకాశం బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. ఒక్క ఐదేళ్లు ఛాన్స్ ఇచ్చి చూడండి..…
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నియంతగా ఎవరు వ్యవహరించినా ప్రజలు సహించన్నారు. కేసీఆర్ నిజాంల పాలన కొనసాగించాలని… తను ,తన తరవాత కొడుకు, కొడుకు తర్వాత ఆయన కొడుకు అధికారంలో ఉండాలని అనుకుంటున్నారన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 7 ఏళ్లలో ఏమి చేసిందో చర్చించేందుకు సిద్ధం. సీఎం సవాల్ స్వీకరిస్తున్నా అన్నారు.
వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే యూపీ సీఎంగా యోగి అదిత్యనాథ్ ఎన్నికల బరిలో ఉండగా.. యోగికి ఓటు వేయకుంటే బుల్డోజర్లు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. యూపీలో హిందువులంతా ఏకమవ్వాలని ఆయన అన్నారు. యోగి అదిత్యనాథ్‌కు ఓటు వేయని ప్రాంతాలను…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లక్షలాదిమంది భక్తుల రాకతో పులకించింది. అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం కనులవిందుగా కనిపించింది. శ్రీరామనుజుల కీర్తి దశదిశలా మరోమారు వ్యాపించింది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనగరంలో 12 రోజుల పాటు జరిగిన మహా క్రతువులో వేలాది మంది రుత్వికులు.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంకురార్పణ నుంచి మహా పూర్ణాహుతి వరకు నిత్యం ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. భారత దేశానికి చెందిన అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు సమతామూర్తిని…
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల కోసం ఏర్పాటు చేసిన సమావేశం అజెండాలో మొదట ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి.. ఆ తర్వాత తొలగించింది కేంద్ర హోంశా శాఖ.. ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం హోంశాఖ సమావేశం అజెండాలో ప్రత్యేకహోదా అంశం పొరపాటున చేర్చారని తెలిపారు.. ఈనెల 17న జరిగే సమావేశం..…
వైసీపీ నేతలు ప్రత్యేక హోదా వచ్చేసినట్టు నిన్న సాయంత్రం వరకు గొప్పలు చెప్పారు.. సాయంత్రానికి కేంద్రం మాట మారిస్తే.. అది చంద్రబాబు వలనే అంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. అనంతపురంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అంటే మీరు అంత బలహీనంగా ఉన్నారా..? లేక చంద్రబాబు కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.. ముందు హోదా అంశం లిస్ట్‌లో ఉందో లేదో తేల్చండి అని…
విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది… కూర్మన్నపాలెం మెయిన్ గేటు వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పీపుల్స్‌స్టార్ ఆర్ నారాయణ మూర్తి మద్దతు ప్రకటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమం చేపట్టి ఏడాది అవుతున్న కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. కార్మికుల ఉద్యమం పట్టించుకోదా..? ఏ ముఖం పెట్టుకొని విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణమూర్తి.. ఏ రాష్ట్రం, ఏ…
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని మేం ఆడిగామా? అని అస్సాం సీఎం అంటే.. కాంగ్రెస్ పార్టీగా నేను అస్సాం సీఎంకి ఎంత మంది తండ్రులని అడగాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ తండ్రి ఎవరని మూర్ఖత్వంగామాట్లాడడు.. అసలు రాహుల్…
ఏపీలో మళ్ళీ ప్రత్యేక హోదా రచ్చ ప్రారంభమయింది. ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగించింది కేంద్ర హోంశాఖ. తొలుత ప్రత్యేక హోదా, రిసోర్స్ గ్యాప్ అంశాలను అజెండాలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ. తర్వాత వాటిని తొలగించడం వివాదాస్పదం అవుతోంది. ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా ఎందుకు మారింది?త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన 9 అంశాలను మార్చాలని జీవీఎల్ ప్రకటన…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. క్రమంగా సీఎంను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.. ఈ అంశంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భట్టి……