ట్విట్టర్ లో ‘గోబ్యాక్ మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 7 వేలకు పైగా ట్వీట్స్ వచ్చాయి. మే 26న మోదీ తమిళనాడు పర్యటన ఉంది. హైదరాబాద్ తో పాటు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజల నుంచి మోదీ టూర్ పై కొంతమంది వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు.
మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూన్నాడంటూ ట్వీట్ చేస్తున్నారు. మాకు గుజరాత్ మోడల్ వద్దంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రధానీ మోదీ హయాంలో నార్త్ స్టేట్స్ కు నిధులు ఎక్కువగా ఇస్తున్నారంటూ.. సౌత్ స్టేట్స్ ను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కార్టూన్లను షేర్ చేస్తున్నారు. మోదీ పాలన పోవాలి..నెహ్రూ పాలన రావాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. డీఎంకేతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మోదీ గోబ్యాక్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మోదీ తమిళనాడు పర్యటనను వ్యతిరేఖిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. జనవరి 2020 తమిళనాడు, కేరళ పర్యటనలో కూడా మోదీకి వ్యతిరేఖంగా ఇలాగే గోబ్యాక్ మోదీ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.
మే 26న ప్రధాని మోదీ హైదరాబాద్, చెన్నైలలో పర్యటించనున్నారు. డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా స్టాలిన్ బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా ప్రధాని మోదీ తమిళనాడు వెళ్తున్నారు. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో సాయంత్రం 5.45కు ప్రధాని మోదీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రూ.31,400 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని పర్యటన నేపథ్యంలో చెన్నైలో భద్రత ఏర్పాట్లను టైట్ చేశారు. కొన్ని పార్టీలు ప్రధాని పర్యటనను వ్యతిరేఖిస్తున్నాయి. దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు సమాజంలో విద్వేషాలు పెంచేలా రైట్ వింగ్ ప్రయత్నాలు చేస్తోందని పలు పార్టీలు ఆరోపిస్తూ.. ప్రధాని పర్యటనకు నిరసన తెలపాలని ప్లాన్ చేస్తున్నాయి.