G7 Summit: కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న జీ7 సమ్మిట్ కు భారతదేశానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కెనడా ప్రధాని మార్క్ కార్నే ఫోన్ చేసి సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు.
India-Pakistan: సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ భారత్‌కు ఇప్పటి వరకు 4 లేఖలను రాసింది. ఒక లేఖను మే నెల ప్రారంభంలో రాయగా.. మిగతా 3 లేఖలను ఆపరేషన్ సింధూర్ తర్వాత రాసిందని పలు జాతీయ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నాయి.
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తొలిసారి కాశ్మీర్ లోయలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చినాబ్ వంతెన ప్రారంభోత్సవం జమ్మూ కాశ్మీర్ పురోగతికి ప్రతిబింబమని అన్నారు.
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సందీప్ మాధుర్‌ను జీఎంగా నియమించింది రైల్వే బోర్డు.. ఈ మేరకు గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు.. ఢిల్లీ రైల్వే సిగ్నల్ ఆధునికీకరణ ప్రాజెక్టు సారథిగా ఉన్న సందీప్ మాధుర్ కు సౌత్ కోస్ట్ రైల్వే బాధ్యతలు అప్పగించారు.. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్వాగతించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సందీప్ మథూర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. దీనికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ,…
ప్రధాని మోడీ శుక్రవారం జమ్ముూకాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనను మోడీ ప్రారంభించనున్నారు. రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తేంటో ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సహచర మంత్రులకు ఆపరేషన్ సిందూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచ దేశాలు మన బలాన్ని చూశాయని గుర్తుచేశారు.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రమాదం పూర్తిగా హృదయ విదారకం అన్నారు.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రివర్గం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోడీ జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలిసారి మోడీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.