PM Modi: “బ్రహ్మోస్ క్షిపణి” శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రపట్టదు..
- బ్రహ్మోస్ క్షిపణి శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రపట్టదు..
- మరోసారి పాక్ పాపం చేస్తే యూపీ క్షిపణులతో సమాధానం..
- పాకిస్తాన్ బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్న ఎస్పీ, కాంగ్రెస్..
- శివుడి ఆశీస్సులతో పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం..
- వారణాసి ర్యాలీలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తీరును కొనియాడారు. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై మే 7న భారత్ తీవ్రదాడి చేసింది. ఈ దాడిలో స్వదేశీ ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని మోడీ శనివారం అన్నారు. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లు ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారతదేశం) బలాన్ని నిరూపించాయని ప్రధాని మోదీ చెప్పారు.
Read Also: Car Sales Slow Down: ట్రంప్ సుంకాల ప్రభావం.. కార్లు కొనడానికి భయపడుతున్న జనం..!
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
బ్రహ్మోస్ క్షిపణులు భారతదేశ శత్రువుల్లో భయాన్ని రేకెత్తించాయి అని ఆయన అన్నారు. ‘‘బ్రహ్మోస్ క్షిపణి శబ్ధం వింటే పాకిస్తాన్ నిద్రపోదు’’ అని ప్రధాని అన్నారు. లక్నోలో కొత్తగా ప్రారంభించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ గురించి ప్రస్తావిస్తూ, ఈ క్షిపణులు ఉత్తర ప్రదేశ్‌లో తయారు చేయడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని ప్రధాని అన్నారు. పాకిస్తాన్ మళ్లీ ఏదైనా పాపం చేస్తే యూపీలో తయారైన క్షిపణులు ఇప్పుడు ఉగ్రవాదులను నాశనం చేస్తాయని అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌ని డ్రామాగా విమర్శించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ బాధ పడితే ఈ రెండు పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మన సైన్యాన్ని నిరంతరం అవమానిస్తోందని ఆరోపించారు. ప్రత్యేక రోజునే పహల్గామ్ ఉగ్రవాదుల్ని ఎందుకు చంపారని ఎస్పీ ప్రశ్నిస్తోందని, వారికి చెప్పి చేయాలా..? అని మోడీ ప్రశ్నించారు. 26 మంది పౌరులను చంపిన పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇచ్చిన హామీని శివుని ఆశీస్సులతో నెరవేర్చామని ప్రధాని మోదీ అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?