Trump: భారత్ గురించి ఆ మాట విన్నాను.. అలా చేస్తే మంచిదే
- భారత్ గురించి ఆ మాట విన్నాను.. అలా చేస్తే మంచిదే
- భారత్‌పై ట్రంప్ తాజా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకోవడాన్ని అమెరికా ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం కారణంగానే ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ నిత్యం రుసరుసలాడుతూనే ఉంటున్నారు. భారత్ మంచి స్నేహితుడే గానీ.. రష్యాతో సంబంధాలు కారణంగానే 25 శాతం సుంకాలు విధించాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఆగస్టు 1 నుంచి భారత్‌పై 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Kalabhavan Navas: మలయాళ నటుడు కళాభవన్ నవాస్ అనుమానాస్పద మృతి!
Also Read
తాజాగా భారత్ గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తున్నట్లు విన్నానని.. అలా చేస్తే ఇది చాలా మంచి అడుగు అని ట్రంప్ ప్రశంసించారు. భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోదని అర్థమవుతుందన్నారు. ఈ మాటే తాను విన్నానని చెప్పుకొచ్చారు. తాను విన్నాది సరైందో కాదో తనకు తెలియదు గానీ.. ఒక వేళ అలా చేస్తే మాత్రం మంచి పరిణామం అన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: OG : పాట లీక్.. సుజీత్ కొంప ముంచిన థమన్ !
ఇటీవల భారత్ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా దగ్గర సైనిక పరికరాలు, చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. భారతదేశం కారణంగానే రష్యా రెచ్చిపోయి.. ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందని పేర్కొన్నారు. తక్షణమే రష్యాతో సంబంధాలు తెంచుకోవాలన్నారు. లేదంటే రక్షణ, ఇంధన ఒప్పందాలు ఇలానే కొనసాగిస్తే ప్రస్తుతం 25 శాతం సుంకం మాత్రమే విధిస్తున్నామని.. భవిష్యత్‌లో జరిమానాలు కూడా ఉంటాయని భారత్‌ను ట్రంప్ హెచ్చరించారు.
#WATCH | "I understand that India is no longer going to be buying oil from Russia. That's what I heard, I don't know if that's right or not. That is a good step. We will see what happens…" says, US President Donald Trump on a question by ANI, if he had a number in mind for the… pic.twitter.com/qAbGUkpE12
— ANI (@ANI) August 1, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?