ఆపరేషన్ సిందూర్పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్ను బీజేపీ రాజకీయం చేస్తోందని.. త్రివిధ దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్ను కమలనాథులు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
PM Modi: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
PM Modi: బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ని మరోమారు హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని గురువారం చెప్పారు. పాకిస్తాన్ గడ్డపై భారత్ మూడుసార్లు దాడి చేసిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
ప్రధాని మోడీ-పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గురువారం ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వమే లక్ష్యంగా మోడీ విమర్శలు గుప్పించారు.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర విభేదాలకు కారణమవుతోంది. శశిథరూర్ తీరుపై హస్తం పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్పై ప్రధాని నరేంద్రమోడీని థరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా,
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టారు. రెండు నిమిషాలు మౌనంగా మెడిటేషన్ చేసి తీర్మానాన్ని బలపరచమని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో ఉన్నాం.. వత్తిడితో ఉన్నాం.. గత ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు అని తెలిపారు.
BJP MP Laxman: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలన పైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్మారు అని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారు.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు మోడీ.. దేశంలో అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంటుంది అని గుర్తు చేశారు. కానీ, ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని మండిపడ్డారు.
Himanta Biswa Sarma: అస్సాంలో బాల్య వివాహాలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వివాహాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల 2021-22, 2023-24 మధ్య కాలంలో రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఇటువంటి కేసులు 81 శాతం తగ్గాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2026 నాటికి అస్సాంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి శపథం చేశారు.
PM Modi: దేశ విభజన జరిగిన 1947లో తొలి ఉగ్రవాద దాడిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిందని, ఇప్పుటికీ భారత్ ఈ ఉగ్రవాద వికృతరూపాన్ని అనుభవిస్తోందని గుజరాత్లో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అ