BJP MP Laxman: ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ అన్నారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రధాని మోడీ.. వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో దౌత్య బృందాలు విజయం సాధించాయని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు అధికార-ప్రతిపక్షాలతో కూడిన ఏడు బృందాలను ఆయా దేశాలకు కేంద్రం పంపించింది.
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ విమర్శించారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు అనుకుంటా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 18 మాసాల పాలన విశ్లేషిస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. పేద, వెనుకబడిన వర్గానికి చెందిన నరేంద్ర మోడీ…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 15-17 వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగబోయే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెళ్లనున్నారు. ఇటీవల, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసిన జీ-7 సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు, దీనికి మోడీ ఒప్పుకున్నారు. అయితే, కెనడాకు వెళ్తూ, మార్గం మధ్యలో సైప్రస్‌లో ప్రధాని మోడీ ఆగనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డిని నియమించింది. ఈ రోజు నుంచి రెండేళ్ళ పాటు “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి కొనసాగనున్నారు. నియామక ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా మండలి పనిచేయనున్నది. డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి భారత ప్రభుత్వం డీ.ఆర్.డీ.ఓ. (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) మాజీ చైర్మన్. భారత…
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన, రేవంత్ రెడ్డి 18 నెలల పాలన బేరీజు వేస్తే.. తెలంగాణ సీఎం పాలన ఏందో తెలుస్తుందన్నారు. రేవంత్ తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారని, ముఖ్యమంత్రి పదవిని రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ భరోసా కార్యక్రమంకి వందల మంది సమస్యలు…
PM Modi: మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన నేటి (జూన్ 9న)కి ఏడాది పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో తన 11 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నారు.
G7 Summit: కెనడాలోని ఆల్బెర్టాలో జూన్ 15-17 వరకు జరుగబోతున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం రాకపోవడమో లేక ఆయనే ఈ సమావేశానికి వెళ్లకపోవడమో జరుగుతుందని అందరూ అంచనా వేశారు. అయితే, శుక్రవారం కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి సమావేశాలకు రావాలని కోరారు. ఆయన…
Madhavi Latha: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెనను శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ వంతెన దేశాన్ని మొత్తం జమ్మూ కాశ్మీర్‌తో అనుసంధానిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంలో ఒక మహిళా ప్రొఫెసర్ జి మాధవి లత కృషిని అంతా కొనియాడుతున్నారు. 17 ఏళ్లుగా ఆమె తన జీవితాన్ని వంతెన నిర్మాణానికి ధారపోశారు.