PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రధానం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నేతుంబో నంది-న్దైత్వా మోడీకి ఈ పురస్కారాన్ని అందించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి దేశమైన నమీబియాలో ప్రధాని పర్యటిస్తున్నారు.
మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలు అంటే బలం, చైతన్యం కలిగి ఉన్నారు.. బీసీలు అంటే ముందుండి నడిపించే వాళ్ళని నిరూపించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. గత పాలకులు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారు అని ఆరోపించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగనున్నాయి. కేశవ్ కుంజ్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేతృత్వంలో మంతన్ బైటక్ జరగనుంది.
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్‌లపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సుంకాలపై విధించిన డెడ్‌లైన్ జూలై 9తో ముగుస్తోంది. ఇక ఈ డెడ్‌లైన్ పొడిగించే ప్రసక్తే లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు.
సింధు జలాలు ఏకపక్షంగా నిలిపివేసే అధికారం భారత్‌కు లేదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్య ఢిల్లీ దుష్ట కుట్రగా అభివర్ణించారు. మంగళవారం నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ ఒకేసారి ఐదు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధాని పర్యటించనున్నారు.
Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగాల కల్పన ప్రోత్సాహక పథకంకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక, కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగ కల్పనా సామర్థ్యం, సామాజిక భద్రత పెంచేందుకు సరికొత్త పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు.
నేను రౌడీలతో పోరాటం చేస్తున్నా.. రాష్ట్రంలో వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో.. పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ప్రజా వేదికపై మాట్లాడుతూ.. .వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.
అమెరికా-భారతదేశం మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 8న వెలువడే అవకాశం ఉంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం జరగబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ కీలక ప్రకటన చేశారు.