PM Narendra Modi: “ప్రాజెక్ట్ టైగర్”కి 50 ఏళ్లు.. నేడు పులుల డేటా విడుదల చేయనున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
50 years of Project Tiger: ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పులుల గణన డేటాను విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని చామనగర జిల్లా బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించనున్నారు ప్రధాని. హైదరాబాద్, చెన్నై పర్యటన తర్వాత ఆయన మైసూర్ వెళ్లారు. ‘అమృత్ కాల్’ సందర్భంగా పులుల సంరక్షణ కోసం ప్రభుత్వ విధానాలను కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో మైసూర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 9 వరకు పర్యాటకులను టైగర్ రిజర్వ్ లోకి అధికారులు అనుమతించడం లేదు. జాతీయ రహదారి 181పై వాహనాల రాకపోకలను మూసేశారు. ఆదివారం ఉదయం 7.15 గంటలకు బందీపూర్ టైగర్ రిజర్వ సందర్శించిన తర్వాత 11 గంటలకు పులుల డేటాను విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక నాణేన్ని విడుదల చేయనున్నారు.
Also Read
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబిసిఎ) ద్వారా ప్రపంచంలోని పులి, సింహం, చిరుత, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ వంటి పులుల సంరక్షణపై దృష్టి సారించారు. బందీపూర్ టైగర్ రిజర్వ్ లో పులుల సంరక్షణ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందితో ప్రధాని ముచ్చటించనున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ముదుమలై టైగర్ రిజర్వ్ లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.
ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏమిటి?
ప్రాజెక్ట్ టైగర్ ను భారత్ దేశం ఏప్రిల్ 1, 1973న ప్రారంభించింది. తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచడంతో పాటు వాటిని సంరక్షించడానికి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు దేశంలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్‌లను కలిగి ఉంది. గత 50 ఏళ్లుగా ఇండియాలో పులుల సంఖ్య క్రమంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం 75,500 చ.కి.మీ విస్తీర్ణంలో 53 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశంలో 3000 పులులు ఉన్నాయి. ప్రపంచంలో పులుల జనాభాలో 70 శాతం భారత్ లోనే ఉన్నాయి. ప్రతీ ఏడాది 6 శాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతోంది. ‘ప్రాజెక్ట్ టైగర్’ స్థానిక ప్రజలకు ఏటా 45 లక్షల పనిదినాలకు పైగా ఉపాధిని కల్పిస్తుంది.
తాజావార్తలు
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!