CPI Narayana: సాంకేతిక అంశంతో రాహుల్ గాంధీని వేధిస్తున్నారు.. ఈ పాపం ఊరికే పోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయతర కక్ష దాగుందని స్పష్టమవుతోందన్నారు. రాహుల్ గాంధీపై కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక్‌సభ స్పీకర్ ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఆ వెంటనే ఎంపీగా దక్కిన నివాసాన్ని ఖాళీ చేయమని హుకుం చేయడం అంత వ్యక్తిగత కక్ష లాగా అనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో మోడీ, అదానీల చేతికి మట్టి అంటకుండా కేవలం సాంకేతిక అంశాలను పైకి చూపించి రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దుచేసి అధికారిక నివాసం నివాసం నుండి ఖాళీ చేయించారని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అనేక త్యాగాలు చేసిందన్నారు.
Read Also: Bhatti Vikramarka: సీఎల్పీ నేత పాదయాత్రలో అకాల వర్షం.. పరుగులు తీసిన నేతలు
Also Read
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
రాహుల్ గాంధీ తాత ముత్తాతలు బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఆయన ముత్తాత మోతీలాల్ నెహ్రూ అలహాబాద్ లో ఢిల్లీలో ఖరీదైన భవనాలను దేశం కోసం ఇచ్చేశారని తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ కూడా అనేక త్యాగాలు చేశారని, రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలర్పించారని నారాయణ గుర్తు చేశారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీపై వ్యక్తిగత కక్షతో సాంకేతిక అంశాలను చూపించి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయన తన ఢిల్లీ అధికారిక నివాస తాళం ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. ఈ పాపము ఊరికే పోదని దేశ ప్రజలు మరిచిపోరని, అలాగే కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను సైతం గమనిస్తున్నారని, బీజేపీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని నారాయణ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!