Ashwini Choubey : కనిపిస్తే కాల్చేయాలి.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Choubey : కేంద్ర మంత్రి అశ్విని చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్న వారు కనిపిస్తే కాల్చేయాలన్నారు. శుక్రవారం బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నా జిల్లాలో శుక్రవారం ప్రార్థనా సంఘం వద్ద ఒక వ్యక్తి అతీక్‌కు మద్దతుగా, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంఘటనపై చౌబే మండిపడ్డారు. ‘‘జుమ్మా నమాజ్ చేసిన తర్వాత వారిలో ఒకరు ‘అతిక్ అహ్మద్ అమర్ రహే’ అని అరిచాడు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేసాడు’’ అని పాట్నా సిటీ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు. ఈ విషయంపై మంత్రి అశ్విని చౌబే ఆగ్రహం వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ సంఘటన చాలా విచారకరం. బీహార్‌లో ఇటువంటి ప్రకటనలు, నినాదాలు చేయడం దురదృష్టకరం. అలాంటి వారిని వెంటనే కాల్చివేయాలన్నారు.
Read Also: Telangana congress : టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శన
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై ‘‘దేశ ప్రధానికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పేర్లు పెట్టుకుని నినాదాలు చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరం’’ అని అన్నారు. అదే సమయంలో బిహార్ ప్రభుత్వంపై అశ్విని చౌబే విమర్శలు గుప్పించారు. టెర్రరిజం, మాఫియా వంటి నేరస్థులను విడిచిపెట్టని ‘యోగి’ మోడల్ బీహార్‌లో మనకు అవసరమన్నారు. బీహార్‌లో కేవలం మామ-మేనల్లుడి వంశం, కులవివక్ష ప్రభుత్వం నడుస్తోందని అశ్విని చౌబే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని టార్గెట్ చేస్తూ సీఎం నితీశ్ కుమార్ ప్రకటనలు చేస్తున్నారని.. 2025లో రాష్ట్రంలో యోగి మోడల్‌ను ఎంచుకుని ప్రజలే వారికి సమాధానం చెబుతారంటూ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో బీహార్ ప్రజలు యోగి మోడల్‌ను అధికారంలోకి తీసుకువస్తారని.. బీహార్‌లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్త పరిచారు.
Read Also: Weather Updates : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడా వడగళ్ల వాన
తాజావార్తలు
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!