ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను సాధిస్తోందని, ప్రపంచం దేశం వైపు చూస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన డగ్రీ అంశం ఇప్పుడు రాజకీయంగా విపక్షాలు టార్గెట్ చేశాయి. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక లేఖ రాశారు.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాని నరేంద్రమోదీకి జైలు నుంచే లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్ లాగా సిసోడియా కూడా ప్రధాని విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తారు. మనీస్ సిసోడియా రాసిన లేఖను సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ లేకలో సిసోడియా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. భారత దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని అన్నారు.
Today Business Headlines 07-04-23: ‘సచిన్’కి తనిష్క్ కానుక: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరుతో వజ్రాభరణాలు అందుబాటులోకి వచ్చాయి. టాటా గ్రూపునకు చెందిన తనిష్క్ జ్యూలరీ కంపెనీ.. ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 24వ తేదీన సచిన్ 50వ పుట్టిన రోజు జరుపుకోనుండటంతో వీటిని తయారుచేయించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని వర్చువల్ గా వర్చువల్ మాట్లాడారు.
PM Modi: భగవాన్ హనుమాన్ స్పూర్తితో దేశంలోని అవినీతి, బంధు ప్రీతి, వారసత్వ రాజకీయాలు, శాంతిభద్రతల సవాళ్లపై పోరాడలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ హనుమంతుడిలా దేశం కోసం ధృడసంకల్పం, దేశ సంక్షేమం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని, పార్టీ కార్యకర్తలు త్యాగం, అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.
బెంగళూరును అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.