PM warangal tour: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్రంలో వరుస పర్యటనలు, కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర కీలక నేతలు ఇక తెలంగాణపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తెలంగాణకు రాబోతున్నారని బీజేపీ శ్రేణుల్లో సన్నాహాలు మొదలయ్యాయి. వరంగల్ లో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సోమవారంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండగా.. మరుసటి రోజు తెలంగాణకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాదిన పార్టీ విస్తరణకు కర్నాటకలో గెలుపు కీలకమని, అక్కడ ఓట్లు రాబట్టే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే వ్యూహంతో సరిహద్దుల్లో సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల కోడ్ సమస్య లేకుండా జహీరాబాద్, నారాయణపేట లేదా మరెక్కడైనా సభ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగించడంతోపాటు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనల ద్వారా పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి వివిధ రంగాల్లో మంజూరైన నిధులు, ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
ఏప్రిల్ 8న భారత ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న కేంద్ర బలగాలు.. రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే బారత్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని 10వ ప్లాట్‌ఫాం నుంచి ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
Fake gang: సైబరాబాద్‌లో కల్తీ ముఠా… కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్