Bharat Express Train: ప్రధాని నరేంద్రమోదీ శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో వందేభారత్ ట్రైన్ తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో 12వ వందేభారత్ రైలును ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం అనంతరం తమిళనాడు పర్యటకు వెళ్లారు.
ప్రధాని మోడీ వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణపై మోడీకి విద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులపై విద్యుత్ భారం పెంచుతామంటే వ్యతిరేకించాం తప్ప, కేంద్రానికి అన్ని విషయాల్లో సహకరించామని ఆయన తెలిపారు.
ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించ లేదరి మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. మోడీ సభకు జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని అన్నారు. ఇది పార్టీకి సంబందించిన సభ కాదు అధికారిక సభ అని హర్షం వ్యక్తం చేశారు.