సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో.. బేగంపేట విమానాశ్రయం వద్ద చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి,
బొగ్గు బావులను ప్రయివేటు పరం చేస్తే ఊరుకోబోమని, కేంద్రంపై జంగ్‌సైరన్ మోగిస్తామని సింగరేణి కార్మికులు భగ్గుమంటున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పిన ప్రధాని మోడీ... కేంద్ర ప్రభుత్వానికి హటావో సింగరేణి బచావో నినాదం వినిపించేలా మహాధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను హత్య చేస్తానని బెదిరిస్తూ మీడియా సంస్థకు ఇమెయిల్ పంపినట్లు భావిస్తున్న లక్నో యువకుడిని నోయిడా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు బీహార్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. చెన్నై విమానాశ్రయంలో మొత్తం రూ.2,437 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనంతో సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.