వారణాసిలో గంగా నదీ పుష్కరాల నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సమ్మేళనం' కాశీ తెలుగు సంగమం' కార్యక్రమం నేడు జరగనుంది. "కాశీ తెలుగు సంగమం" పేరుతో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.
Amit Shah: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. బీజేపీ తరుపున శుక్రవారం పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నుంచి కర్ణాటకను కాపాడుతుందని ఆయన అన్నారు. శిరహట్టిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఓటు సరైన…
తెలుగు రాష్ట్రాలలో నూతన విద్యా విధానం అమలు చేయాలి అని అన్నారు. పేదరికం నిర్ములన కావాలంటే.. విద్యా విధానంలో సమునమార్పులూ తీసుకుని రావాలి అని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు."రేడియో, ఎఫ్ఎం విషయానికి వస్తే, దానితో నాకు ఉన్న సంబంధం ఉద్వేగభరితమైన శ్రోతతో పాటు హోస్ట్‌గా ఉంటుంది" అని ప్రధాన మంత్రి అన్నారు.
Off The Record: ప్రధాని మోడీ విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనని ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైందట. అభివృద్ధి, టెక్నాలజీ లాంటి అంశాల్లో మోడీతో కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పినా.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చే విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న బాబు కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయట. అంటే.. బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైపోయిందా..? అనే రీతిలో…
PM Modi: కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో బూత్ స్ఠాయిలో ప్రచారాన్ని పటిష్టం చేయాలని, మెజారిటీతో గెలుపొందాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని. కాంగ్రెస్ పార్టీ వారంటీ గడువు ముగిసిందని, ఆ పార్టీ ఇచ్చే హామీలకు అర్థం లేదని అన్నారు. ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశాన్ని, ప్రభుత్వాన్ని…
కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తిరువనంతపురం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. మంగళవారం ఉదయం తిరువనంతపురం చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. అనంతరం సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 1 నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
కేరళలో తొలి వందే భారత్ రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు త్రివేండ్రం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళలోని కొచ్చిలో నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు.
రాష్ట్రానికి మోడీ చేసిన మోసాలు, బీజేపీ చేసిన అన్యాయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని మంత్రి కేటీఆర్ నేతలకు సూచించారు. బీఅర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కేటీఆర్ ఆదివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ నెల 25న జరగబోయే ప్రతినిధుల సభలు.. వచ్చే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లు అంటూ నేతలకు సూచనలు చేశారు.