నర్హత వేటుకు గురైన కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్‌సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ చేశారు. తన సామాన్లను ట్రక్కులో తరలించారు.
అస్సాం బిహు పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గౌహతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో ఎయిమ్స్ గువాహటిని ప్రధాని ప్రారంభించారు. ఎయిమ్స్ క్యాంపస్‌ను రూ.1,123 కోట్లతో నిర్మించారు.
Bihu Dance Enters Guinness Book Of World Records: భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన ‘బిహు నృత్యం’ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. అస్సాంలో గురువారం ఒకే వేదికపై బిహు నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నానికి గుర్తింపు లభించింది. 11,000 మంది కళాకారులు, డ్రమ్మర్లు, నృత్యకారులతో సహా గౌహతిలోని సరుసజై స్టేడియంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం ఉంది. ముఖ్యంగా మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోడీ కూడా సభలు, పలు అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు.
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన బీజేపీ కార్యక్రమం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏం సంబంధం, ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.
రష్యా దాడితో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ ఇప్పుడు ఇతర దేశాల సాయాన్ని కోరుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖను భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి పంపారు.
ప్రధాని మోడీ 8న తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ వచ్చిన మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం పరేఢ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం దిబ్రూఘర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్ సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.
దేశంలో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 2024 ఏప్రిల్ లేదా మే లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఇప్పుటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. ఈసారి మోదీ సర్కార్ కు గద్దె దించాలని ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.