S Jaishankar: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఎంత ప్రతిష్టాత్మకమైందో వివరించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ‘అత్యున్నత స్థాయి గౌరవం’గా ఆయన అభివర్ణించారు. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు.
Green Card: అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముందు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు శాశ్వతంగా అమెరికాలో స్థిరపడేందుకు జారీ చేసే గ్రీన్ కార్డ్ అర్హత నిబంధనలను సరళీకరించింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(EAD) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది
Sukesh Chandrashekhar: అవినీతి, మనిలాండరింగ్ కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అతను అక్కడ నుంచి ఆప్ పార్టీ, సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా పలు ఆరోపణలు చేశారు. మరోవైపు తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెస్ కు ప్రేమ లేఖలు కూడా రాస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు సుకేష్ చంద్రశేఖర్. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల కోసం ఏకంగా…
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విపక్షాల ఐక్యత గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడకుంటే.. తర్వాత భారతదేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని ఆప్ గురువారం ఆరోపించింది.
US Predator drone Deal: అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల(MQ-9B సీగార్డియన్ డ్రోన్) కొనుగోలు ఒప్పందానికి భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) గురువారం ఈ ఒప్పందానికి ఓకే చెప్పింది. అయితే ఈ కొనుగోలుకు ప్రక్రియకు ముందు ఈ డీన్ ను భద్రతకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.
Vande Bharat Trains: భారత రైల్వేలు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోడీ వరసగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 5 వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ జూన్ 26న ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని వీటిని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
Maharashtra: మహరాష్ట్రలో పాలక బీజేపీ- శివసేన(ఏక్ నాథ్ షిండే) కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓ పత్రికా ప్రకటన ఈ రెండు పార్టీల మధ్య విబేధాలకు కారణం అవుతోంది. ‘‘దేశంలో మోడీ.. మహారాష్ట్రలో షిండే’’ అనే ట్యాగ్ లైన్ తో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ పత్రికా ప్రకటన వేయించింది.
సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పెద్ద సముద్రాల వద్ద సిద్దిపేట నుండి ఎల్కతుర్తి వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు.