అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్భంగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో వైట్ హౌస్ పేర్కొనింది.
అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్రమోడీ భాగంగా బుధవారం న్యూయార్క్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ కలిశారు. మస్క్ తనను తాను మోడీ అభిమాని అని కూడా చెప్పుకున్నారు.
PM Modi: రష్యాపై భారత వైఖరి స్పష్టంగా ఉందని, భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.
సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, చట్ట నియమాలను పాటించడం, విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో మాకు నమ్మకం ఉందని, అదే సమయంలో భారత్ తన సార్వభౌమాధికారాన్ని, గౌరవాన్ని పరరక్షించడంలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Puri Jagannath Rath Yatra: ఒడిశా పూరీలోని జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు పూరీకి చేరుకున్నారు. పూరీ క్షేత్రం మొత్తం ఆధ్యాత్మికంగా మారింది. ఒడిశా ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం జగన్నాథ
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో పాల్గొనడంతో పాటు అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు. అయితే మోడీ పర్యటనపై దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా తెగ ఉలికిపడుతున్నాయి. ఇరుదేశాల మధ్య బలపడుతున్న బంధం తమకు ఎక్కడ నష్టాన్ని కలిగిస్తుందో అని తెగ భయపడుతున్నాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఈ పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు. ఇది అమెరికా-ఇండియా భాగస్వామ్య శక్తికి ప్రతిబింబం అని పేర్కొన్నారు. అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో పర్యటన, ప్రాధాన్యత గురించి వివరాలను తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.‘‘ ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్. జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు నేను యూఎస్ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నాను. మన…
PM Modi US Visit: అమెరికా పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం జూన్ 21న తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్ లోని ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో దిగాల్సి ఉంది.