Governor Tamilisai: నాది కన్నింగ్ ఆటిట్యూడ్ కాదు.. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని గవర్నర్ తమిళి సై అన్నారు. మా తండ్రి పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ అని అన్నారు. నాకు గవర్నర్ గా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్రపతి కూడా మహిళ కావడం గర్వకారణమన్నారు. కోవిడ్ నుండి ఎలా బయట పడాలి, ప్రతి విద్యార్థీ కి నాణ్యమైన విద్యను అందించడం నా ప్రాధాన్యతగా ఉండేదని అన్నారు. 6 గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నాను… అక్కడ మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టానని తెలిపారు. గిరిజనుల మధ్య వాక్సిన్ తీసుకున్నానని, పిర్యాదులు బాక్స్ ద్వారా వచ్చే ధరకాస్తు లని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నా పరిధిలో ఉన్న వాటిని పరిస్కరిస్తున్నానని తెలిపారు. రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని అన్నారు. బతుకమ్మ వేడుకలు మొదటి సారి రాజ్ భవన్ లో నిర్వహించామన్నారు. తెలంగాణ, పుదుచ్చేరిలలో నా విధుల్లో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటున్నానని గవర్నర్ అన్నారు.
Read also: Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు
రాష్ట్రంలో బాలికలకు విద్యా కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. నేను భయపడనని, కోర్ట్ కేసులతో, ప్రోటోకాల్తోను, విమర్శలతోనో నన్ను ఆపలేరని అన్నారు. రాజ్యాంగ పరిరక్షకురలిగా పని చేస్తున్నానని తెలిపారు. మీ మద్దతుకు ధన్యవాదాలు, ఇదే రకమైన మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. నేను ఎప్పుడూ సంతోషంగా నే ఉంటానని అన్నారు. తెలంగాణకు సమయం ఇస్తున్న… ప్రజలకి న్యాయం జరగాలన్నారు. ఇక్కడ నాకు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ లేవన్నారు. ఇంకా 30 ,40 యేళ్లు నా ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. నేను సవాళ్లకు ప్రతి బంధకాలకు భయపడనని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా నావిధులను బాధ్యతలను ఈ సవాళ్ళన్ని అధిగమించి నిర్వహిస్తానని తెలిపారు. ప్రజల విజయమే నా విజయమన్నారు. ప్రజలందరి ప్రకాశవంతమైన.. సుసంపన్నమైన భవిష్యత్తు కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానని గవర్నర్ తమిళి సై అన్నారు. రిటైర్మెంట్ అనే పదాన్ని నేను హేట్ చేస్తానని అన్నారు. బతికున్నన్ని రోజులు పనిచేస్తూనే ఉంటాఅని.. 24గంటలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటానని అన్నారు. అర్థరాత్రి 2 గంటలకు కూడా ఏదో ఒక పని చేయడం నా కిష్టమన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ రావొచ్చన్నారు. కేంద్రంతో ఫ్రెండ్లీ గా ఉండొచ్చు కదా? ప్రధాని వస్తె రిసీవ్ చేసుకోవడానికి సీఎం ఎందుకు రారు అని అన్నారు. తెలంగాణ ఏ లక్ష్యంతో ఏర్పడిందో అవి నెరవేరాలని అన్నారు.
Home Guard Wife: నాకు న్యాయం జరగాలి.. అప్పటి వరకు పోస్టుమార్టానికి ఒప్పుకోను