PM Modi: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన G20 సమ్మిట్ విజయవంతంగా పూర్తయింది. కాగా ఈ విజయంలో ఉన్నత అధికారులతో పాటుగా పోలీసులకి కూడా భాగం ఉంది. ఈ విషయం స్వయంగా మోడీనే చెప్పారు. చెప్పడమే కాదు పోలీసుల కృషిని గుర్తించి ఆ కృషిని దేశవ్యాప్తంగా తెయచేసేందుకు పోలీసులతో కలిసి విందు చేయనున్నారు ప్రధాని మోడీ. వివరాలలోకి వెళ్తే జి20 సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభించే విధంగా ప్రధాని మోడీ ఈ వారం పోలీసులతో కలిసి విందు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ప్రతి జిల్లా నుండి శిఖరాగ్ర సమావేశంలో అబ్దుతంగా పనిచేసిన కానిస్టేబుళ్లు, ఇన్స్పెక్టర్ల జాబితాను కోరినట్లు ఫోర్స్ లోని వర్గాలు తెలిపాయి.
ఈ జాబితాలో 450 మంది సిబంది ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరు మిస్టర్ అరోరాతో పాటు, G20 సమ్మిట్ వేదికగా ఉన్న భారత్ మండపంలో ప్రధానితో కలిసి విందు చేసే అవకాశం ఉంది. ఈ వారం ప్రారంభంలో G20 సమ్మిట్‌కు కొంతమంది ఢిల్లీ పోలీసు సిబ్బంది చేసిన కృషికి పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ప్రత్యేక ప్రశంస డిస్క్ మరియు సర్టిఫికేట్‌ను కూడా ప్రదానం చేశారు. సమ్మిట్‌కు ముందు మరియు సమ్మిట్ సమయలో ఢిల్లీ పోలీసులు చేసిన కృషి వర్ణనాతీతమే అని చెప్పాలి. అంతర్జాతీయ నేతలతో భారత్ ప్రపంచ వేదికగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. అత్యున్నత స్థాయిలో భద్రతను చేపట్టేందుకు మరియు రహస్యాలను నిర్ధారించడానికి, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మరియు ఢిల్లీ పోలీసు సిబ్బంది నాయకులు మరియు వారి ప్రతినిధి బృందాలు బస చేసిన హోటళ్లకు కోడ్ పదాలను కూడా ఉపయోగించారు పోలీసులు.