Putin: భారత మిత్రదేశం రస్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ‘‘పీఎం మోడీ ఈస్ రైట్’’ అంటూ ఓ సదస్సులో ప్రశంసించారు. రష్యా వ్లాడివోస్టాక్ నగరంలో 8వ ‘ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్’ సదస్సులో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాను ప్రధాని మోడీ ప్రోత్సహిస్తూ సరైన పనిచేస్తున్నారని అన్నారు. కార్ల తయారీపై మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దేశీయంగా తయారైన ఆటోమొబైల్స్ ని వినియోగించాలని, ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత్ ఇప్పటికే ఈ విధానాన్ని చేపడుతోందని అన్నారు.
Read Also: NEET: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు..
ప్రస్తుతం రష్యాకు దేశీయంగా తయారుచేసిన కార్లు లేవు, కానీ ఇప్పుడు మేం చేస్తున్నామని, రష్యా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మెర్సిడెస్, ఆడి కార్లతో పోలిస్తే ఇవి నిరాడంబరంగా 1990లా ఉంటాయని వ్యాఖ్యానించారు. భారతదేశం, ఆ దేశంలో నిర్మించిన కార్ల వినియోగంపై దృష్టి సారించిందని పుతిన్ కొనియాడారు. ఇదే విధంగా రష్యాలో తయారైన ఆటోమొబైల్స్ ని వినియోగించడం మంచిదని అన్నారు. తాజాగా జీ20 సమావేశంలో యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయిల్, యూరప్, ఇండియా దేశాలు కలిసి ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్’ ఎకనామిక్ కారిడార్(IMEC)ని ప్రారంభించాయని, ఇది రష్యాకు ఆటంకం కలిగించేది కాదని, రష్యాకు దీనితో ప్రయోజనం ఉంటుందని పుతిన్ అన్నారు.
ఈ ఎకనామిక్ కారిడార్ ముందుగా యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, భారత్ అంగీకరించిన తర్వాత చివరకు అమెరికా కూడా వచ్చి చేరిందని పుతిన్ వెల్లడించారు. రష్యా దేశానికి లాజిస్టిక్స్‌ను అభివృద్ధి చేయడంలో IMEC సహాయం చేస్తుందని రష్యా అధ్యక్షుడు చెప్పారు. ఈ ప్రాజెక్టు చాలా ఏళ్లుగా చర్చల్లో ఉందని తెలిపారు. జీ20 వేదికగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్‌పై వివిధ దేశాలు ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో మెగా రైల్వే, షిప్పింగ్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. దీని వల్ల భారత్‌తో అరబ్, గల్ఫ్, యూరప్ దేశాలు అనుసంధానం కానున్నాయి.