Justin Trudeau: కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదంపై జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో తాను, ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తానీ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి చర్చించుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం తెలిపారు. ట్రూడో వ్యాఖ్యలు కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలు పెరగడం, తీవ్రవాద అంశాల పట్ల ఆ దేశం మెతక వైఖరికి వ్యతిరేకంగా వచ్చాయి. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను ఖలిస్తాన్ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి ప్రశ్నించగా.. ఈ రోజు తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సంవత్సరాలుగా పోరాడుతున్న రెండు అంశాలపై చర్చించానని చెప్పారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఖలిస్తానీ నిరసనల గురించి మాట్లాడుతూ.. కెనడా ఎల్లప్పుడూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ, శాంతియుత నిరసన స్వేచ్ఛను కాపాడుతుందని, అవి ఆ దేశానికి చాలా ముఖ్యమైనవని అన్నారు. అయినప్పటికీ హింసను నిరోధించడానికి, ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. కొద్ది మంది చేసే చర్యలు మొత్తం సమాజానికి లేదా కెనడాకు ప్రాతినిధ్యం వహించవని గుర్తుంచుకోవాలన్నారు. చట్టాన్ని గౌరవించడం ప్రాముఖ్యత గురించి ప్రధాని మోడీ చర్చించామన్నారు. బ్రిటీష్ కొలంబియాలోని కెనడాలోని సర్రే పట్టణంలోని శ్రీ మాతా భామేశ్వరి దుర్గా దేవాలయం వెలుపలి గోడలపై భారతదేశ వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీతో అపవిత్రం చేయబడిన కొన్ని రోజుల తర్వాత ట్రూడో ప్రకటన రావడం గమనార్హం.
Also Read: Israel: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్”.. ఇజ్రాయిల్ ప్రధాని ప్రశంసలు..
ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా జస్టిన్ ట్రూడోతో భేటీపై స్పందించారు. వివిధ రంగాలలో పూర్తి స్థాయి ఇండియా-కెనడా సంబంధాల గురించి చర్చించామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జులైలో, భారత ప్రభుత్వం ఢిల్లీలోని కెనడా రాయబారిని పిలిపించి, కెనడాలో ఖలిస్తానీ అనుకూల గ్రూపుల ఉనికి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక దౌత్య సందేశాన్ని అందజేసింది. ఆ సమయంలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. కెనడా టెర్రరిజంపై స్థిరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, అలా చేయడంలో తన నిబద్ధతను కొనసాగిస్తుందని చెప్పారు. ఖలిస్తాన్ మద్దతుదారులు, దేశంలోని ఉగ్రవాదుల పట్ల తమ ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తుందని భావించడం సరికాదని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..