Asaduddin Owaisi: “మాకు టికెట్ ఇస్తే హిందువుల ఓట్లు రావని”.. ఇండియా కూటమిపై ఓవైసీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఫైర్ అయ్యారు. సోమవారం ఓ కార్యక్రంలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కూటమిలోకి తమను ఆహ్వానించకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూటమిలో భాగం కానని, దానితో ఉంటే నరకం అని, కూటమిలో చేరితో ఉక్కిరిబిక్కిరి అయ్యేదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. కూటమిలో చేరడానికి తమకు ఆహ్వానించపోవడాన్ని తాను పట్టించుకోనని అన్నారు.
‘‘నేను ఇండియా కూటమిలో లేనిని.. దాన్ని పట్టించుకోనని, ఇండియా కూటమి సిద్దాంతాలు బీజేపీకి ఎందుకు వ్యతిరేకంగా నిలవడం లేదు. మాకు టికెట్ ఇస్తే వారికి హిందూ ఓట్లు రావని అనుకుంటున్నారు, వారు మూసిన గోడల వెనక ఇలాగే మాట్లాడుతున్నారు, ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెబుతున్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
Read Also: Punjab: పంజాబ్‌లో కాంగ్రెస్ నేత హత్య.. తామే చంపామన్న ఖలిస్తానీ ఉగ్రవాది..
2018 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓడిపోవడాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోతే, వయనాడ్ నుంచి ఓడిపోకుండా అప్పుడు రక్షించింది ముస్లిం లీగ్ అని ఓవైసీ అన్నారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు, వయనాడు నుంచి గెలిచారు, అక్కడ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయలేదు, అక్కడ బీజేపీతో నాకు ఎలాంటి ఒప్పందం లేదు, అయితే అక్కడ ముస్లిం లీగ్ ఉంది, కాబట్టే ఆయన వయనాడ్ నుంచి గెలిచాడు, రాహుల్ గాంధీ మునిగిపోకుండా కాపాడిందని ఓవైసీ అన్నారు.
ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వ సంస్థలు దాడులు చేస్తుంటే, ఎంఐఎం నేతలపై ఎలాంటి కేసులు లేవని, వారికి బీజేపీ, ప్రధాని మోడీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ ఆరోపించిన తర్వాత ఓవైసీ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒక్క టీఆర్ఎస్ తోనే కాదు బీజేపీ, ఎంఐఎంతో పోరాడుతోందని అన్నారు. బీజేపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టే కేసీఆర్, ఎంఐఎం నేతలపై ఎలాంటి కేసు లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!