Canada Expels Top Indian Diplomat: కెనడా-భారత మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే దౌత్యసంబంధాలు అనుమానంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని భారత్ వ్యతిరేఖంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత మొదలైంది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాదిని చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద నమ్మదగిని ఆరోపణలు ఉన్నాయి అని సోమవారం మధ్యహ్నం సమయంలో పార్లమెంటరీ ప్రతిపక్షాల అత్యవసర సమయంలో చెప్పారు. ‘కెనడా గడ్డపై కెనడా పౌరుడి హత్యలో ఏదైనా విదేశీ ప్రభుత్వ ప్రమేమయం మా సార్వభౌమాధికారారిని ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన’ అని ట్రూడో అన్నారు. ఈ విషయంపై సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో కెనడా భారతదేశంపై ప్రతీకార చర్యలను చేపట్టింది. విదేశాంగమంత్రి మెలానీ జోలీ, భారత అగ్రశ్రేణి దైత్యవేత్తను బహిష్కరించింది. తాము భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) అధిపతిని బహిష్కరించినట్లు జోలీ తెలిపారు. అయితే ఆ అధికారి పేరును నేరుగా చెప్పలేదు.
Read Also: Big Breaking: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ఖలిస్తానీ ఉద్యమం, భారత వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ ను జూన్ 18న వాంకోవర్ లోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. సిక్కులకు కేంద్రంగా ఉండే సర్రేలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో పాకిస్తాన్, యూకేల్లో కొందరు ఖలిస్తానీ వేర్పాటువాదులు కూడా ఇలాగే మరణించారు. భారత్ నుంచి పంజాబ్ ని విడదీసి సిక్కు దేశాన్ని ఏర్పాటు చేయాలని నిజ్జర్ పలుమార్లు పిలుపునిచ్చాడు.
భారత్ తరువాత కెనడాలోనే అత్యధిక మంది సిక్కులు ఉన్నారు. ఇదిలా ఉంటే సిక్కు వేర్పాటువాదుల్ని సంతృప్తి పరిచేందుకు, భారత్ వ్యతిరేఖ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కెనడా కళ్లుమూసుకుందని భారత్ ఆరోపించింది. దీనిపై ప్రధాని ట్రూడో మాజీ సలహాదారు జోసెలిన్ కూలన్ స్పందించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా బాంబు ప్రభావం’’ కలిగి ఉందని ఈ చర్యను అభివర్ణించారు. 2018లో టర్కీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గిని సౌదీ అరేబియా హత్య చేసింది. విదేశాల్లో రాజకీయ హత్యలు చేసే దేశాల సమూహంలో భారత్ చేరుతుందని ఆయన అన్నారు. కెనడా ఆరోపణలపై భారత్ వెంటనే స్పందించలేదు.
ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత్ లో నిర్వహించిన జీ20 సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని మోడీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కూడా ఖలిస్తానీ అంశమే కీలకంగా చర్చకు వచ్చింది. కెనడా గడ్డను భారత వ్యతిరేక చర్యలకు ఉపయోగించవద్దని భారత్ తీవ్రంగా స్పందించింది. అయితే శాంతియుతంగా భావప్రకటనను తెలిపే చర్యలను కెనడా ఎప్పుడూ అడ్డుకోదని అడ్డగోలుగా ఆ దేశం వ్యాఖ్యానించింది.