New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలోకి మోడీ ఎంట్రీ.. సభ ముందుకు రానున్న మహిళా బిల్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో సభ కొలువుదీరింది. మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనంలోకి ఎంపీలంతా ఎంట్రీ ఇచ్చారు. ప్రధాని మోడీ కేంద్రమంతులు పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషిలతో పార్లమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఇతర విపక్షాల ఎంపీలు కొత్త పార్లమెంట్ భవనంలో సభకు హాజరయ్యారు.
ఆధునికతకు అద్దం పట్టేలా, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం ప్రతీకగా నిలుస్తుందని, వినాయక చతుర్థి రోజున పార్లమెంట్ భవనంలోకి వచ్చామని, సభ్యులందర్ని ఆహ్వానించారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మన లక్ష్యమని ఆయన అన్నారు. చరిత్రను ప్రతిబింబిచేలా కొత్త పార్లమెంట్ ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అజాదీకా అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలం అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా పనిచేయాలని సూచించారు. నెహ్రూ చేతికి శోభనిచ్చిన సెంగోల్ కొత్త పార్లమెంట్ లో ఉందని ఆయన అన్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: Parliament Sessions : పాత పార్లమెంట్‌కి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోడీ.. ఏంటంటే..?
కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ కార్యకలాపాలకు ముందు స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ..ఈ రోజు ప్రజాస్వామ్య చరిత్రలో చాలా ముఖ్యమైన రోజని, కొత్త పార్లమెంట్ లో లోక్‌సభ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామని, దీనికి సాక్ష్యంగా నిలిచే అదృష్టం మనకు కలిగిందని, ఈ చారిత్మాత్మక రోజు మీ అందరికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఇదిలా ఉంటే కొత్త పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తీసుకురాబోతోంది. సోమవారం క్యాబినెట్ మహిళా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మెఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు.
#WATCH | In the Lok Sabha of the new Parliament building, PM Narendra Modi says, "…I extend my heartiest welcome to all of you in this new Parliament building. This occasion is unprecedented in several ways. This is the dawn of Azadi ka Amrit Kaal…" pic.twitter.com/JbVM43eXLv
— ANI (@ANI) September 19, 2023
#WATCH | Proceedings of the Lok Sabha begin in the New Parliament building. pic.twitter.com/LafXM9xUD9
— ANI (@ANI) September 19, 2023
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!