బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభా వేదికగా వాగ్బాణాలను సంధించారు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతమంటూ విమర్శలు గుప్పించారు.
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రజలందరకీ నమస్కారములు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోడీ తెలంగాణ వాసుల మనస్సు దోచుకునే ప్రయత్నం చేశారు.
మహబూబ్నగర్లో బీజేపీ ఏర్పాటు చేసిన 'పాలమూరు ప్రజాగర్జన' సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్పై మాటల తూటాలు సంధించారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏ రకమైన ప్రభుత్వం ఉందో చూడాలన్నారు కిషన్ రెడ్డి.
మహబూనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్లైన్, వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు.
PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు అధికారులు స్వాగతం పలికారు.
నేడు తెలంగాణకు వస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపారు. ఇవాళ మహబూబ్ నగర్కు వస్తున్నట్లు తెలిపిన ఆయన బీజేపీ ర్యాలీలో ప్రసంగిస్తానని పేర్కొన్నారు. మహబూబ్నగర్లో 13,500 కోట్ల రూపాయలకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రేపు (ఆదివారం) తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనకు ముందు కాంగ్రెస్ , బీఆర్ఎస్లపై ఆయన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు.