Mahua Moitra: ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేయడంతో మోయిత్రా కేసులో చిక్కుకుంది. తాజాగా ‘‘క్యాఫ్ ఫర్ క్వేరీ’’ అని పిలువబడుతున్న ఈ కేసులో లోక్‌సభ ఎథిక్స్ కమిటీ మహువా మోయిత్రాకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 31న హాజరుకావాలని ఆదేశించింది. ఈమెపై వచ్చిన ఆరోపణల్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది.
మహువా మోయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేతో పాటు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌లను కమిటీ మూడు గంటల పాటు విచారించిన తర్వాత సమన్లు జారీ చేసింది. వీరు చేసిన ఆరోపణల్లో ప్రతీ అంశాన్ని కమిటీ చర్చించినట్లు తెలిసింది. లోతైన దర్యాప్తు కోసం కేసుకు సంబంధించిన కీలక అంశాలపై వివరాలు కోరుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖకు లేఖలు పంపినట్లు ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోంకర్ విలేకరులకు తెలిపారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: China: చైనాలో ఏం జరుగుతోంది..? రక్షణ, విదేశాంగ మంత్రుల తొలగింపు..
ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పాటు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీలపై విమర్శలు చేసేందుకు, అందుకు తగ్గట్లు పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగింనందుకు మహువా మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి లంచం తీసుకున్నట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆ తరువాత హీరానందానీ కూడా ఈ ఆరోపణలు నిజమే చెబుతూ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. తాను చేయకూడని తప్పులు చేయించిందని మోయిత్రాపై ఆరోపణలు చేశారు.
ఈ విషయమై ఇప్పటికే నిషికాంత్ దూబే పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే మోయిత్రా పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరేవారితో పంచుకుందని, ఆమె ఇండియాలో ఉన్న సమయంలో కూడా దుబాయ్ కేంద్రంగా లాగిన్ అయినట్లు ఆరోపించారు. దీనిపై విచారించాల్సిందిగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు. అయితే ఈ వ్యవహారంలో టీఎంసీ పార్టీ కూడా ఆమెకు దూరంగా ఉంటోంది.
తాజావార్తలు
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
-
Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!